Begin typing your search above and press return to search.
ఆయన అలిగారు! : తెదేపా బుజ్జగింపులకు తూచ్!!
By: Tupaki Desk | 20 Jan 2015 9:06 AM GMTవిశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు హరిబాబుకు అవమానం జరిగింది! కావాలనే చేశారా, అనుకోకుండా జరిగిందా అనే అనుమానాలు కాసేపు పక్కన పెడితే... సాధారణంగా సౌమ్యంగా కనిపించే బిజెపి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు హరిబాబుకు ఆగ్రహం రప్పించారు టీడీపీ మంత్రులు! మంత్రులం కదా మేము పైన ఉంటాం... సాధారణ ఎంపీగారు కింద కూర్చుంటారులే అనుకున్నట్లుగా ప్రవర్తించారు ఏపీ మంత్రులు! వీరి తీరుపై తీవ్రంగా ఆగ్రహించిన హరిబాబు అలిగి అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయారు. ఈ సమయంలో హరిబాబును బుజ్జగించేందుకు మంత్రి గంటా శ్రీనివాస రావు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది!
తాజాగా విశాఖపట్నంలో మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప ప్రారంభించారు! ఆ కార్యక్రమానికి స్థానిక పార్లమెంటు సభ్యుడు హరిబాబును ఆహ్వానించారు! ఆహ్వానించడం వరకూ గుర్తుపెట్టుకున్నారు కానీ... గౌరవ పార్లమెంట్ సభ్యుడిని కనీసం వేదిక పైకి పిలిచే ఆలోచన చేయలేకపోయారు! దీంతో స్థానిక పార్లమెంటు సభ్యుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అక్కడే ఉన్న మత్రులను, ఉన్నతాధికారులను ప్రశ్నించిన ఎంపీ హరిబాబు తీవ్ర అసంతృప్తికి గురయ్యి అక్కడి నుండి విసురుగా లేచి వెళ్లిపోయారు! ఈ పరిణామంతో కంగుతిన్న టీడీపీ నేతలు, మంత్రులు వెంటనే ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నించినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది అన్నట్లు ఎంపీ గారు వెళ్ళిపోయారు!
ఇది చాలా చిన్న విషయం అని టీడీపీ నేతలు పైకి చెప్పుకుంటున్నా... తెలుగుదేశం, బిజెపి మిత్రపక్షాలుగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సంఘటన ఇరు పార్టీలపై కచ్చితంగా తీవ్ర ప్రభావం చూపుతుందనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తోన్నారు! ఇది ఎంపీకి జరిగిన అవమానంగానే కాకుండా బీజేపీకి టీడీపీ నేతలు ఇస్తోన్న గౌరవంగా హరిబాబు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లే ప్రమాదం ఉందని మరికొందరి వాదన! ప్రస్తుతం టీడీపీ - బీజేపీ ల మధ్య జరిగే ప్రతి విషయమూ అంత సున్నితంగా ఉంటోంది మరి!
అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం అనిపించుకోగలిగే స్థాయికి భారతీయ జనతా పార్టీ కూడా ఎదుగుతోంది. అలా ఆ పార్టీ బలపడే క్రమంలో కంభంపాటి హరిబాబు.. పార్టీకి వెన్నుదన్నుగా వ్యూహరచన చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. రాష్ట్రంలోని కొందరు భాజపా నాయకులకు అయిష్టం కలిగినా.. ఆయన తెదేపాకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీని బలోపేతం చేస్తున్నారనేది రాజకీయవర్గాల్లో ఉన్న ప్రచారం. ఈ నేపథ్యంలో తెదేపా మంత్రులు ఆయనను అవమానించినట్లుగా ఈ కార్యక్రమంలో ప్రవర్తించడం అనేది ముందు ముందు మరింత అభిప్రాయభేదాలకు తెరలేపవచ్చుననే అనుమానం కలుగుతోంది.