Begin typing your search above and press return to search.
హరికృష్ణ..నిమ్మకూరు..కన్నీటి జ్ఞాపకాలు..
By: Tupaki Desk | 29 Aug 2018 8:17 AM GMTఢిల్లీకి రాజైన ఓ అమ్మకు కొడుకే.. ఓ ఊరి గ్రామస్థుడే.. నిమ్మకూరి నుంచి రాష్ట్ర రాజకీయాలను ఏలిన ఎన్టీఆర్ - హరికృష్ణలు తమ సొంతూరుకు చాలా చేశారు. గ్రామ రూపురేఖలను మార్చేశారు. నాడు ఎన్టీఆర్ మరణాన్ని జీర్ణించుకోలేని నిమ్మకూరు.. నేడు హరికృష్ణ మరణాన్ని కూడా తట్టుకోలేకపోతోంది. హరికృష్ణ మరణవార్తతో నిద్రలేవాల్సి వస్తుందని తాము ఊహించలేదని నిమ్మకూరు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిమ్మకూరులో ఎన్టీఆర్ తర్వాత గ్రామమంతా తెలిసింది హరికృష్ణకేనని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరిని గుర్తించి పేరు పెట్టే పిలిచే అనుబంధం హరికృష్ణకు మాత్రమే ఉందని.. ఈ గ్రామంలో అందరికీ తెలిసిన వ్యక్తి ఆయనొక్కడే అంటూ గ్రామస్థులంతా గుర్తు చేసుకుంటున్నారు.
1956 సెప్టెంబర్ 2న నిమ్మకూరులో ఎన్టీఆర్-బసవతారకం దంపతులకు హరికృష్ణ జన్మించారు. హరికృష్ణ బాల్యం, విద్యాభ్యాసం, వివాహం అన్నీ నిమ్మకూరులోనే జరిగాయి.. హరికృష్ణ భార్య లక్ష్మీది కూడా నిమ్మకూరే కావడం గమనార్హం. హరికృష్ణ ఎంపీ, మంత్రిగా ఉన్న సమయంలో నిమ్మకూరులో చాలా అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన సేవలను గ్రామస్థులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. కొడుకు జానకీరామ్ మరణం తర్వాత హరికృష్ణ తీవ్రంగా కృంగిపోయాడని.. చివరగా 10 నెలల క్రితం నిమ్మకూరుకు కళ్యాన్ రామ్ తో కలిసి వచ్చాడని గ్రామస్థులు గుర్తుచేసుకుంటున్నారు.