Begin typing your search above and press return to search.
ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో శ్రీరాముడికి ఇల్లు
By: Tupaki Desk | 28 Dec 2018 8:48 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతలు శ్రీరాముడిని నిత్యం వార్తల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయోధ్య అంశం ఇప్పటికే వార్తల్లో నిలుస్తుండగా తాజాగా బీజేపీ ఎంపీ ఒకరు ఏకంగా రాముడికి ఇల్లు కేటాయించాలంటూ అధికారులకు లేఖ రాశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద శ్రీరాముడికి ఇల్లు కేటాయించాలని బీజేపీ ఎంపీ హరినారాయణ్ రాజ్ భర్ అయోధ్య జిల్లా మేజస్ట్రేట్ కు లేఖ రాశారు. రాముడు ప్రస్తుతం టెంట్ లో ఉంటున్నారని హరినారాయణ్ ఈ లేఖలో పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘోసీ నియోజకవర్గం నుంచి హరినారాయణ్ రాజ్ భర్ తొలిసారి ఎన్నికయ్యారు. 2014లో ఆయన మాయావతి పార్టీకి చెందిన కీలక నేతపై భారీ విజయం నమోదు చేశారు.
కాగా అయోధ్యలో రామమందిరం ఎప్పుడు నిర్మించినా అది తమ హయాంలోనే జరుగుతుందని, మరొకరితో సాధ్యం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిందూ సంస్కృతే భారత సంస్కృతని అన్నారు. మరోవైపు అయోధ్యలో మందిర నిర్మాణానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. మందిర్ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాదని షా చెప్పారు. తాజాగా హరినారాయణ్ రాజ్ భర్ మాత్రం ఏకంగా రాముడికి ఇల్లు కేటాయించాలని కోరి ఈ అంశాన్ని మరోసారి చర్చలోకి తెచ్చారు.