Begin typing your search above and press return to search.
హరీష్ రావు ఏమన్నారంటే : బాలయ్య బయట అలా కానీ...?
By: Tupaki Desk | 22 Jun 2022 3:37 PM GMTబాలయ్య అంటే ఏం చెబుతారు. మంచి నటుడు అంటారు. లేక ఆయన ఎన్టీయార్ వారసుడు అంటారు, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు అని కూడా అంటారు. ఇక పర్సనల్ గా చూస్తే బాలయ్యకు కోపం ఎక్కువ అని కూడా అనేవారు ఉన్నారు. కానీ బాలయ్యను ఒకసారి దగ్గరగా చూస్తే మాత్రం ఆయనను ఇష్టపడని వారు ఉండరు. ఆయన కోపం తాటాకు మంట. ఆయన మనసు వెన్న అనే అంటారు.
సరిగ్గా ఇదే మాటను తెలంగాణా మంత్రి హరీష్ రావు కూడా చెప్పారు. ఆయన బసవతారకం ఆసుపత్రి 22న వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా హాజరైన సందర్భంగా బాలయ్య గురించి చాలానే చెప్పారు. బాలయ్యకు ఉన్న కమిట్మెంట్ కి ప్రశంసించాల్సిందే అన్నారు.
బాలయ్య ఒక వైపు సినిమా నటుడిగా మరో వైపు హిందూపురం ఎమ్మెల్యేగా ఇంకో వైపు బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా కూడా రాణిస్తున్నారని, మూడు విభిన్న రంగాలలో ఒక వ్యక్తి రాణించడం అంటే కష్టం అది బాలయ్యకే చెల్లు అనేశారు.
బాలయ్య బయట కరకు కానీ లోపాల మాత్రం ఆయన మనసు వెన్న. ఆయన మంచి మనిషి అని కితాబు ఇచ్చారు. ఇక ఆయన కోపం వచ్చినా క్షణాల్లో పోతుందని అన్నారు. ఎన్టీయార్ మాదిరిగా బాలయ్య కూడా తెల్లారుజామున రెండున్నర గంటలకు నిద్రలేచి యోగా వంటి ఆరోగ్య కరమైన కసరత్తు చేస్తూ ఉంటారని హరీష్ రావు అన్నారు. అలా బ్రహ్మ ముహూర్తాన నిద్రలేచేవారు అతి కొద్ది మంది మాత్రమే అని హరీష్ రావు చెప్పడం కూడా విశేషమే.
మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కే కాదు సాదా సీదా జనాలకు కూడా ఆయన అంటే ఏమిటో చెప్పారు హరీష్ రావు. ఇక కేసీయార్ కి ఎన్టీయార్ అంటే చాలా అభిమానమని కూడా చెప్పుకొచ్చారు. బసవతారకం ఆసుపత్రిని బాలయ్య ఇన్నేళ్ళ పాటు చిత్తశుద్ధితో నిర్వహిస్తారు అంటే ఆయన సేవా భావం బహు గొప్పది అని కూడా హరీష్ అన్నారు.
నిజంగా బాలయ్య చేస్తున్నది మంచి కార్యక్రమే. ఆయన మనసు కూడా గొప్పదే. ఇది హరీష్ రావు మాత్రమే కాదు ఆయన్ని దగ్గరగా చూసిన వారు అంతా అనే మాట అదే కదా.