Begin typing your search above and press return to search.

అసెంబ్లీ లాబీల్లో హరీశ్.. భట్టిలు మాట్లాడుకుంటే..

By:  Tupaki Desk   |   6 Jan 2017 5:25 AM GMT
అసెంబ్లీ లాబీల్లో హరీశ్.. భట్టిలు మాట్లాడుకుంటే..
X
టీవీల్లో అసెంబ్లీ సమావేశాలు చూసే వారంతా.. వారి వారి అభిమానాలకు తగినట్లుగా ఎమోషనల్ అయిపోతుంటారు. అధికార.. విపక్షాల మధ్య నడిచే మాటల యుద్ధాన్ని చూసే వారంతా.. తాము అభిమానించే వారికి తగ్గట్లుగా చీలిపోతుంటారు. వైరి వర్గంపై విరుచుకుపడుతుంటారు. ఇక.. అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగినప్పుడు.. అధికార.. విపక్షాల మధ్య నడిచే లొల్లి ఒక స్థాయిలో ఉండదు. ఆ సందర్భంగా ఒకరిపై మరొకరు వాడీవేడీగా మాటల ఆస్త్రాల్ని సంధించుకోవటం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆవేశ కావేశాలు ఓ రేంజ్ కు చేరుకుంటాయి కూడా.

అసెంబ్లీలో అంత హాట్ హాట్ గా మాట్లాడుకునే నేతలు ఇద్దరు.. అసెంబ్లీ అయ్యాక..లాబీల్లో తారసపడితే.. వారి మధ్య మాటలు ఎలా ఉంటాయి? అన్నది చూస్తే ఆసక్తికరంగానే కాదు.. పైకి ఎంత పోట్లాడుకున్నా.. విడిగా మాత్రం వారి మధ్య రిలేషన్ చక్కగానే ఉంటుందనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో తప్పించి.. సభలోని హాట్ నెస్.. సభ బయట అంతగా కనిపించదనే చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీలో విపక్షాల తరఫున తీవ్రస్థాయిలో విరుచుకుపడే కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. అధికారపక్షానికి చెందిన హరీశ్ లు ఎంతగా మండిపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గురువారం వారిద్దరూ అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడ్డారు. భట్టి మీడియాతో సరదాగా మాట్లాడుతున్న వేళ.. అటుగా వచ్చిన హరీశ్ ను చూసి.. ‘అన్నా.. ఆ మాటతో మమ్మల్ని ఇబ్బంది పెట్టనవు గదనే’’ అని భట్టి వ్యాఖ్యానించారు. మాటిమాటికీ మా మైక్ కట్ చేసిండ్రు అని భట్టి వ్యాఖ్యానించగా.. అన్నా.. మీరు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు నా మైకు కూడా నిమిషానికోసారి ఫట్ పట్ మని కట్ చేసిండ్రు గనే నని పాత విషయాల్ని తవ్వుతున్నట్లుగా హరీశ్ వ్యాఖ్యానించారు.ఆ పై ఇద్దరు కాసేపు మాట్లాడుకోవటం వేరే సంగతి. అసెంబ్లీ సమావేశాల్ని లైవ్ లో చూసి తరచూ ఆవేశానికి గురయ్యే వారంతా.. లైవ్ లో చూపించని ఇలాంటివి ఉంటాయని తెలుసుకుంటే మంచిది. కాస్త ఆవేశం తగ్గటమే కాదు.. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/