Begin typing your search above and press return to search.
హరీశ్..ఉమలు చెబుతున్న మొండివాదం..వితండవాదం ఇదే
By: Tupaki Desk | 23 Jun 2016 4:22 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న కృష్ణా జల వివాదం మరో మలుపు తిరిగింది. అధికారుల మధ్య సాగిన చర్చలు ఒక కొలిక్కి రాకపోవటం.. ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాలు కూర్చొని ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం తేల్చి చెప్పింది. మరోవైపు ఈ వ్యవహారంపై రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు హరీశ్ రావు.. దేవినేని ఉమలు కూర్చొని మాట్లాడుకున్నా పెద్దగా ఫలితమేమీ లేదు. ఈ వివాదంపై ఇరు వర్గాల వారు తమదైన శైలిలో ఎదుటి పక్షం వారిని తప్పు పడుతూ మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
కృష్ణా జలాల వివాదం మీద తెలంగాణ మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసేది వితండవాదంగా ఆరోపిస్తే. దీనికి కౌంటర్ అన్నట్లు ఏపీ సాగునీటి శాఖామంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. ఈ వివాదం మీద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది మొండివాదనగా చెప్పుకొచ్చారు. ఇలా మాటకు మాట అనుకుంటున్న ఇరువురు నేతల వాదనల్ని ఎవరికి వారిగా చూస్తే..
హరీశ్ ఏమంటున్నారంటే..
= కృష్ణా జలాల వినియోగంపై రెండు రోజులుగా కృష్ణా బోర్డు.. కేంద్ర అధికారులతో చర్చలు జరుపుతున్నా ఆంధ్రప్రదేశ్ వితండవాదన వాల్లే ఫలితాలు ఇవ్వటం లేదు.
= కృష్ణా బోర్డు ఆదేశాల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది.
= కృష్ణా బోర్డు పరిధిలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకొస్తే మాకెలాంటి అభ్యంతరం లేదు. మరి.. దీనికి ఏపీ సిద్ధమేనా?
= నాగార్జునసాగర్ ఒక్కదాన్నే బోర్డు పరిధిలోకి తేవాలనటం ఎంతవరకు సమంజసం?
= పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనందున 45టీఎంసీలు.. పట్టిసీమ ద్వారా చేసిన అనుసంధానం ద్వారా మరో 45 టీఎంసీలు మొత్తం 90టీఎంసీలు గోదావరి నీటిని తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం.
= ఆంధ్రప్రదేశ్ కు గత ఏడాది ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ నీరు ఇచ్చాం. మూడో పంటకు సాయం చేశాం.
దేవినేని ఉమ ఏం చెబుతున్నారంటే..
= కృష్ణా బోర్డు విషయంలో తెలంగాణ మొండివాదన చేస్తుంది.
= తెలంగాణకు చెందిన నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్ కు అక్కర్లేదు.
= కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకొస్తామని బోర్డు ముసాయిదా పత్రాన్ని రూపొందించింది.
= కానీ.. నాగార్జునా సాగర్ ప్రాజెక్టు ఒక్కటే బోర్డు పరిదిలోకి తెస్తామని తెలంగాణ ప్రభుత్వం మభ్య పెడుతోంది.
= ముసాయిదాను రూపొందించటానికి రెండు నెలల ముందే రెండు రాష్ట్రాలతో కృష్ణా బోర్డు చర్చించింది.
= కానీ.. తెలంగాణ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. దీనికి ఈ ఉదంతమే పెద్ద ఉదాహరణ.
= కృష్ణా బోర్డు ఆదేశించినప్పటికి 4 టీఎంసీల నీటిని ఆలస్యంగా విడుదల చేశారు.
= గత ఏడాది చేసుకున్న ఒప్పందాలు అమలు చేయకపోవటం వల్లే కృష్ణా బోర్డు ముసాయిదా రూపొందించాల్సి వచ్చింది.