Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ ఫలితాలపై హరీష్ - ఈటెల మౌనం..దేనికి నిదర్శనం?
By: Tupaki Desk | 25 Oct 2019 10:46 AM GMTతెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే.. ఆర్టీసీ సమ్మె ప్రారంభమయింది. సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరిపై.. విపక్ష పార్టీలన్నీ తీవ్రమైన విమర్శలు చేశాయి. దీనితో హుజూర్ నగర్ లో ప్రజాతీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది అని అందరూ భావించారు.
కానీ , కాంగ్రెస్ కంచుకోటని బద్దలుకొట్టుకుంటూ కారు జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో టిఆర్ ఎస్ పార్టీ నేతలు - మంత్రులు అందరూ కూడా కేసీఆర్ కి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ కూతురు - మాజీ ఎంపీ కవిత - మినిస్టర్ ..కొడుకు కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా కేసీఆర్ కి తమ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పార్టీలోని ఇతర మంత్రులు - కీలక నేతలు కూడా కేసీఆర్ కి మీడియా ముఖంగా అభినందనలు తెలియజేసారు.
కానీ , తెరాస సీనియర్ లీడర్ - మంత్రి హరీష్ రావు - మరో కీలక నేత - మాజీమంత్రి ఈటెల రాజేందర్ మాత్రం ఈ హుజూర్ నగర్ విజయం పై ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ఇద్దరూ కూడా టిఆర్ ఎస్ లో మొదటినుండి ఉండి - పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించారు. మొదటినుండి ఇప్పటివరకు కేసీఆర్ వెంట నడిచిన నాయకులు కూడా వీరే. ఎన్నికల ఫలితాలు విడుదలై 24 గంటలు దాటినా కూడా ఫలితాలపై మౌనం వహిస్తూ ఎక్కడా స్పందించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మరి. ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిపోయింది.