Begin typing your search above and press return to search.
తెలంగాణ : ఇద్దరు సీఎంల మధ్య పోటీ
By: Tupaki Desk | 9 Sep 2015 5:26 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో రెండు అధికార కేంద్రాలు పనిచేస్తున్నాయా? సాగునీటిపారుదల, మైనింగ్, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి హరీష్ రావు, పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ ల మధ్య సఖ్యత ఉందా? వీరిద్దరు అవగాహనతో పనిచేస్తూనే వర్గ రాజకీయాలను కొనసాగిస్తున్నారా అంటే అవుననే సమాధనం వస్తోంది.
సీఎం కేసీఆర్ చైనా పర్యటన నేపథ్యంలో హరీష్ రావు రాజకీయ వ్యవహారాలను చూసుకుంటున్నారు. కేటీఆర్ పరిపాలన కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఇందుకు గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలపైన మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందిస్తుండటం.... ప్రభుత్వ పరంగా చేయబోయే కార్యాక్రమాలపైన మంత్రి కేటీఆర్ హామీలు ఇస్తుండటం ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నారు.
కేసీఆర్ చైనా పర్యటనకు ముందే, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, ఇతర సంఘాలు ప్రాజెక్టులు, ఇతర అంశాల పట్ల ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. కార్మిక సంఘాలపై హరీష్ రావు కొద్దిరోజులుగా మండిపడుతున్నవిషయం తెలిసిందే. ప్రాణహితపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళన పట్ల హరీష్ రావు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వంపైన, టీఆర్ ఎస్ పార్టీ పైన ఒక్కమాట పడనీయకుండా చూసుకుంటున్నారు. ప్రతిపక్షాల విమర్శలను రాజకీయంగా తిప్పికొట్టేందుకు ఆయన మూడురోజులుగా విలేకరులతో మాట్లాడుతున్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కృషి చేస్తున్నారని టీఆర్ ఎస్ నేతలు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు తీవ్రం చేసిన క్రమంలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు దూరమవుతున్న కార్మికులు ఇతర, ప్రజల్లో అసంతృప్తులు చెలరేగకుండా వారికి కావల్సిన పనులపై మంత్రి కేటీఆర్ హామీలు ఇచ్చే పనిలో పడ్డారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు ఉండదని సీఎం కేసీఆర్ చెప్పినా, పెంపు విషయంపై ముఖ్యమంత్రి చైనా నుంచి రాగానే మాట్లాడతానని కేటీఆర్ హామీ ఇవ్వడం గమనార్హం. మరోవైపు తెలంగాణలోని పల్లెలను ప్రముఖులు దత్తత తీసుకోవడంపైనా కేటీఆర్ చర్చిస్తున్నారు. ఇదే క్రమంలో వివిధ జిల్లాలు తిరుగుత ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తున్నారు కూడా.
రాజకీయ, పరిపాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడిపేందుకు ఈ నెల 16 వరకు ఆ ఇద్దరు మంత్రులే రాష్ట్రాన్ని పాలిస్తారని తెలుస్తోంది. చైనా పర్యటనకు ముందే ఆ ఇద్దరు మంత్రులకు సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించి వెళ్లారని సమాచారం.
అందులో భాగంగా వారిద్దరు పనులు దిగ్విజయంగా చక్కబెడుతున్నారని అంటున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందులు రాకుండా మాట్లాడితే తప్పేంటని టీఆర్ ఎస్ నాయకులు తెలిపారు. అయితే సీనియర్ నేతలు ఉండగా, వారిద్దరే అన్నింట్లోనూ జోక్యం చేసుకోవడమేంటన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.