Begin typing your search above and press return to search.
వారిద్దరి చాంబర్లు ఖాళీగానే ఉన్నాయ్!
By: Tupaki Desk | 22 Feb 2019 5:34 AM GMTమంత్రులుగా కేటీఆర్.. హరీశ్ లకు అవకాశం ఉండదన్న అంచనాలు అక్షరాల నిజం కావటం ఒక ఎత్తు అయితే.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలకు తగ్గట్లే.. వీరిద్దరికి మంత్రి పదవులు కేటాయించటమా? లేకుంటే అలానే ఉంచేయటమా అన్నది ఉంటుందని చెబుతున్నారు.
కేసీఆర్ తొలి సర్కారులో మంత్రులుగా వ్యవహరించిన కేటీఆర్.. హరీశ్ ఇద్దరికి తాజాగా మంత్రి పదవులు లభించని నేపథ్యంలో.. వారికి కేటాయించిన ఛాంబర్లు ప్రస్తుతం మంత్రులుగా బాధ్యతలు అప్పగించిన వారెవరికి కేటాయించకపోవటం ఆసక్తికరంగా మారింది. కొత్తగా కొలువుతీరిన పది మంది మంత్రుల్లో తొమ్మిది మందికి ఇప్పటికే ఛాంబర్లు కేటాయించారు. కార్మిక మంత్రి మల్లారెడ్డికి మాత్రం ఇంకా ఛాంబర్ కేటాయించలేదు.
కొత్త మంత్రులకు కేటాయించిన ఛాంబర్లలో గతంలో మంత్రులుగా వ్యవహరించిన కేటీఆర్.. హరీశ్ రావుల చాంబర్లను కేటాయించలేదు. మంత్రులుగా వ్యవహరించిన వేళలో హరీశ్ కు డి బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఛాంబర్ కేటాయించగా.. ఇదే బ్లాక్ లోని రెండో అంతస్తులో కేటీఆర్ కు ఛాంబర్ కేటాయించారు. తాజాగా ఆ రెండింటిని మాత్రం వదిలేసి ఛాంబర్లను కేటాయించిన తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో వీరికి మంత్రి పదవులు కట్టబెడతారా? లేక.. అలా ఉంచేస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.