Begin typing your search above and press return to search.
బావా కంగ్రాట్స్:హరీశ్...కేటీఆర్ ఆత్మీయం
By: Tupaki Desk | 7 Dec 2018 9:41 AM GMTతెలంగాణలో జరుగుతున్న పోలింగ్ వేళ ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ సిద్ధిపేటలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీఆర్ ఎస్ నేతలు మంత్రులు హరీశ్ రావు - కేటీఆర్ అనుకోకుండా కలవడంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. బంజారాహిల్స్ లో ఓటేసిన కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల బయలుదేరారు. సిద్ధిపేట నియోజకవర్గంలో పోలింగ్ సరళిని తెలుసుకుంటూ హరీశ్ రావు గ్రామాల్లో పర్యటిస్తుండగా ఈ ఇద్దరు తారసపడటంతో ఆత్మీయ సంభాషణ జరిగింది.
ఎన్నికల ప్రచారం సమయంలో గుర్రాల గొంది గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కేటీఆర్ - హరీశ్ తమ వాహనాలను ఆపి పలకరించుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆత్మీయంగా భావ కంగ్రాట్స్.. నీకు లక్ష మెజార్టీ ఖాయం అని సరదాగా వ్యాఖ్యానించారు. నీ దాంట్లో సగం మెజార్టీ అయినా తెచ్చుకుంటా.. సిరిసిల్ల పోతున్నా అని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉత్సాహంగా జరుగుతోందని ఆనందo వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా - బంజారాహిల్స్ లోని సెయింట్ నిజామిస్ స్కూల్ లో మంత్రి కేటీఆర్ ఓటు హక్కు నియోగించుకున్నారు. ఓటు వేసేందుకు మంత్రి కేటీఆర్ క్యూలో కొద్దిసేపు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో ఫొటోలు దిగేందుకు స్థానిక యువతీ యువకులు పోటీ పడ్డారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు.