Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాలు... ఇద్దరు వైద్య మంత్రులు - వారి తీరే వేరు

By:  Tupaki Desk   |   23 May 2022 8:35 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాలు... ఇద్దరు వైద్య మంత్రులు - వారి తీరే వేరు
X
మంత్రి హ‌రీశ్ రావు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని ఇవాళ‌ ఆక‌స్మికంగా సంద‌ర్శించారు. ఈ విధంగా చేయడంతో అక్క‌డ సిబ్బంది అప్ర‌మ‌త్తం అయ్యారు. ఆస్ప‌త్రిలో సిబ్బందితో మాట్లాడ‌మే కాదు మందుల విభాగాన్నీ, రోగులున్న వార్డుల‌నూ విస్తృతంగా త‌నిఖీ చేసి, ప‌లు సూచ‌న‌లు ఇచ్చి వెళ్లారు.

కేవ‌లం ఇదేం ఫొటో సెష‌న్ కోసం చేసిన ప‌న‌యితే కాదు. వైద్య,ఆరోగ్య శాఖ బాధ్య‌త‌లు చూస్తున్న హ‌రీశ్ త‌రుచూ చేస్తున్న ప‌నే ఇది ! ఇదే స‌మ‌యంలో మ‌న ఆంధ్రా మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ ఏమ‌యినారు ?

వాస్త‌వానికి వైద్య,ఆరోగ్య శాఖ బాధ్య‌త‌లు అందుకున్న ర‌జ‌నీ మొద‌ట గుంటూరు ప్ర‌భుత్వాస్ప‌త్రిని త‌నిఖీ చేశారు. ఆ ఒక్క రోజే హ‌డావుడి చేశారు. సిబ్బందితో క‌య్యం ఆడారు. ఆ త‌రువాత మీడియా ఫొటోలు తీయంగానే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

ఆ ఫొటోలే ఓ వారం రోజులు సోష‌ల్ మీడియాలో సంబంధిత వ‌ర్గాలు స్క్రోల్ చేస్తూ ఉన్నాయి. బాగుంది.. మ‌రి ! త‌రువాత ఆమె ఎక్క‌డ ఉన్నారు. అంటే ర‌జ‌నీ ఆ రోజు చేసిందంతా ప్ర‌చార ఆర్భాటం కోస‌మేనా !

వాస్తవానికి వైద్య‌,ఆరోగ్య శాఖ నిర్వ‌హ‌ణ అన్న‌ది చాలా క‌ష్టం. ఎందుకంటే ఎన్నో స‌వాళ్లు ఉంటాయి. అన‌నుకూల‌త‌లు ఉంటాయి. డిస్ క్వాలిఫికేష‌న్ అన్న‌ది కూడా ఉంటుంది. నిరాశ ఉంటుంది. ఇవేవీ లేకుండా వైద్యారోగ్య శాఖ అన్న‌ది ఉండదు. క్వాలిఫైడ్ ప‌ర్స‌న్స్ లేకుండానే వైద్యం అందించిన దాఖ‌లాలు ఇప్ప‌టికీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఉన్నాయి. తిర్ప‌తి రుయా లో దందాలు ఇప్ప‌టికీ న‌డుస్తున్నాయి.

ఇంకా కొన్ని ఆస్ప‌త్రుల్లో ఆంబులెన్స్ య‌వ్వారాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆమె గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరిట చిల‌క‌లూరి పేట‌లో తిరగ‌వ‌చ్చు. కానీ వీలున్నంత వ‌ర‌కూ స‌మీప ఆస్ప‌త్రుల‌ను త‌నిఖీ చేయాల్సిన బాధ్య‌త కూడా ఆమెదే ! సోష‌ల్ మీడియాలో ఫొటోల కోసం అయినా ఆమె ఓ సారి ప‌నిలో ప‌నిగా మా శ్రీ‌కాకుళంకు వ‌స్తే మేలు.