Begin typing your search above and press return to search.
బర్త్ డే వేళ.. మన్నించాలంటూ హరీశ్ ట్వీట్!
By: Tupaki Desk | 2 Jun 2019 6:36 AM GMTజూన్ 2 అన్నంతనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అన్న విషయం గుర్తుకు వస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు పెద్ద ఎత్తునచేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇవాళే టీఆర్ఎస్ సీనియర్ నేత.. సీఎం కేసీఆర్ మేనల్లుడు కమ్ ఎమ్మెల్యే హరీశ్ రావు పుట్టిన రోజు కూడా.
హరీశ్ ను అభిమానించి.. ఆరాధించే పలువురు నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు పుట్టినరోజు వేడుకలు జరపటానికి హరీశ్ వద్దకు వెళ్లేందుకు రెఢీ అవుతున్నారు. ఇలాంటివేళ.. హరీశ్ పెట్టిన ట్వీట్ ఒకటి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానులు.. కార్యకర్తలను ఉద్దేశిస్తూ వారి అభిమానానికి నమస్కరిస్తున్నానని.. తన పుట్టిన రోజుసందర్భంగా తాను వారిని నిరాశ పరుస్తున్నందుకు మన్నించాలని చెప్పారు.
ఇంతకీ హరీశ్ చేసిన ట్వీట్ ఏమంటే..
" మిత్రులకు - అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు. నా పుట్టిన రోజు (జూన్-3)న శుభాకాంక్షలు చెప్పడానికి.. నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న నేను హైదరాబాద్‌లో కానీ.. సిద్ధిపేటలోకానీ ఉండడంలేదు. మందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటున్నాను. మీ అభిమానానికి మరోసారి తలవొంచి నమస్కరిస్తున్నాను" అని పేర్కొన్నారు. బర్త్ డే వేళ.. తనను అభిమానించే వారికి దూరంగా ఎందుకు ఉన్నట్లు?