Begin typing your search above and press return to search.
ఆ ఒక్కడే హరీశ్ ను గుర్తు చేసుకున్నాడే!
By: Tupaki Desk | 2 Sep 2018 4:50 AM GMTచరిత్రలో నిలిచి పోయేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ మరికొద్ది గంటల్లో షురూ కానుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. పొద్దున్నే పేపరు చూసినంతనే కనిపించే భారీ యాడ్స్ తో హడావుడే వేరు. ఎప్పటిలానే.. భారీ సభకు సంబంధించిన జాకెట్ యాడ్స్ ను టీఆర్ ఎస్ నేతల పేరు మీద వేయటం కనిపించింది.
తెలుగులో పబ్లిష్ అయ్యే అన్ని పేపర్లలోనూ ప్రగతి నివేదన సభకు స్వాగతం.. సుస్వాగతం పేరుతో వేసిన యాడ్స్ లో ఆసక్తికర అంశం కనిపించింది. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కొంగర్ సభకు మంత్రి కేటీఆర్ అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఎక్కడా కనిపించని పరిస్థితి. దీనిపై ఇప్పటికే ఆసక్తికర చర్చ సాగుతోంది. హరీశ్ రావును పక్కన పెట్టేసినట్లుగా.. కేటీఆర్ ను భారీగా ప్రమోట్ చేసినట్లుగా ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు ఉన్నాయన్న మాట వినిపించింది. హరీశ్ అభిమానులు పలువురు తాజా సభలో తమ నేతకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వని వైనంపై గుర్రుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజున కొన్ని పేపర్లకు గాలి అనిల్ కుమార్ పేరిట భారీ జాకెట్ యాడ్ పబ్లిష్ అయ్యింది. హైదరాబాద్ నగర శివారైన పటాన్ చెరు పార్టీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఆయన నిలువెత్తు జాకెట్ యాడ్ ఇచ్చారు. ఇందులో కేసీఆర్ ఫోటో తర్వాత.. తొలుత మంత్రి హరీశ్ రావు ఫోటోను పబ్లిష్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఆయన తర్వాత మంత్రి కేటీఆర్ ఫోటో ఉండటం కొత్త చర్చకు తెర తీసినట్లైంది. ప్రగతి నివేదన సదస్సు మొత్తం కేసీఆర్.. కేటీఆర్ సెంట్రిక్ గా సాగుతున్న వేళ.. కొన్ని యాడ్స్ లో మాత్రం మంత్రి హరీశ్ రావు ఫోటోకు ప్రాధాన్యత ఇస్తూ.. ఆయన ఫోటో తొలుత వేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హరీశ్ ఫోటోను మరికొందరు నేతలు వేయించినా.. వరుస క్రమంలో కేటీఆర్ తర్వాతే ఉండగా.. గాలి అనిల్ కుమార్ ఇచ్చిన యాడ్ లో (ఒక ప్రముఖ దినపత్రికలో) మాత్రం తొలుత హరీశ్ రావు ఫోటో.. ఆ తర్వాతే మంత్రి కేటీఆర్ ఫోటో అచ్చుకావటంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.