Begin typing your search above and press return to search.

హ‌రీశ్ క‌నిపించాడు..ముఖక‌వ‌ళిక‌లు గ‌మ‌నించారా?

By:  Tupaki Desk   |   2 Sep 2018 12:16 PM GMT
హ‌రీశ్ క‌నిపించాడు..ముఖక‌వ‌ళిక‌లు గ‌మ‌నించారా?
X
ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను తెలంగాన రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన నాటి నుంచి మంత్రి హ‌రీశ్ రావు పేరు ప్ర‌తిచోటా వినిపించింది. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న ఊసే క‌నిపించ‌లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్ర‌భుత్వ ఏర్పాటు వ‌ర‌కూ ప్ర‌తి కార్య‌క్ర‌మంలో హ‌రీశ్ చొర‌వ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించేది. దీనికి భిన్నంగా గ‌డిచిన కొద్ది కాలంగా హ‌రీశ్ ను ఆయ‌న జిల్లాకు ప‌రిమితం చేయ‌టం తెలిసిందే.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంలోనూ మంత్రి కేటీఆర్ ను ప్ర‌మోట్ చేయ‌టం.. హ‌రీశ్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్ట‌టం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ త‌ర్వాత కూడా హ‌రీశ్ ను ప‌క్క‌న పెట్ట‌టం.. కేటీఆర్ ను ప్ర‌మోట్ చేయ‌టం పెరిగింది. త‌న త‌ర్వాత త‌న రాజ‌కీయ వార‌సుడు కేటీఆర్ అన్న విష‌యాన్ని త‌న నిర్ణ‌యాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు చెప్పే ప్ర‌య‌త్నం చేశారు కేసీఆర్‌.

దీనికి త‌గ్గ‌ట్లే జాతీయ‌.. అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు కేటీఆర్ కు ప్రాధాన్య‌త ల‌భించ‌టం.. హ‌రీశ్ ఊసే లేక‌పోయేది. ఇది అంత‌కంత‌కూ పెరిగితే.. తాజాగా నిర్వ‌హిస్తున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌ద‌స్సు మొత్తం కేటీఆర్ కేంద్రంగా సాగ‌టం.. హ‌రీశ్ కు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌టంపై ఆయ‌న వ‌ర్గంలో ఆగ్ర‌హం పెల్లుబికింది.

సిత్రంగా ఎప్పుడూ లేనట్లుగా సోష‌ల్ మీడియాలోనూ హ‌రీశ్ మీద సానుభూతి పెల్లుబికింది. టీఆర్ ఎస్‌ లో మొద‌ట్నించి క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన హ‌రీశ్ ను కూర‌లో క‌రివేపాకులా ప‌క్క‌న పెట్టేయ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపించింది. టీఆర్ఎస్ కు ట్ర‌బుల్ షూట‌ర్ అయిన హ‌రీశ్ ను తాజా స‌భ విష‌యంలో ప‌క్క‌న పెట్టేయ‌టంతో ఆయ‌న వ‌ర్గానికి చెందిన నేత‌లు ఎవ‌రూ యాక్టివ్ గా లేర‌న్న మాట వినిపిస్తోంది. మొక్కువ‌డిగా.. అధినేత ఆగ్ర‌హానికి గురి కాకుండా ఉండేలా స‌భా ఏర్పాట్ల‌లో పాల్గొన్నారే కానీ మ‌న‌సు పెట్టి చేయ‌లేద‌న్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (ఆదివారం) మ‌ధ్యాహ్నం నిర్వ‌హించిన కేబినెట్ మీటింగ్ త‌ర్వాత‌.. స‌మావేశంలో నిర్వ‌హించిన అంశాల్ని వెల్ల‌డించేందుకు విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఈ స‌మావేశ మందిరంలోకి తొలుత హ‌రీశ్ రావ‌టం.. ఆయ‌న వెనుక ప‌లువురు మంత్రులు వ‌చ్చారు. అంద‌రితో పాటు హ‌రీశ్ ఒక‌రుగా ఉన్నారే త‌ప్పించి.. ఆయ‌న‌కు ఎలాంటి ప్ర‌త్యేక‌త లేదు. త‌న‌కు అప్ప‌గించిన నాలుగు మాట‌లు మాట్లాడిన హ‌రీశ్ కామ్ గా ఉండిపోయారు. ఇక‌.. ప్ర‌గ‌తి నివేద‌న స‌భా వేదిక మీద కూర్చున్న హ‌రీశ్ వైపు కెమేరాలు ఎక్కువ‌సేపు పోక‌స్ చేయ‌టం క‌నిపించింది. కాసింత గంభీరంగా ఉన్న‌ట్లుగా హ‌రీశ్ క‌నిపించారు.

ఉల్లాసంగా లేక‌పోవ‌టం.. ఇంత పెద్ద స‌భ నేప‌థ్యంలో క‌నిపించాల్సిన హ‌డావుడిలో ఆయ‌న‌లో అస్స‌లేమీ లేదు. తెలిసిన వారింట్లో పెళ్లి జ‌రిగితే ఎలా వెళ్లి కూర్చుంటామో.. అదే రీతిలో హ‌రీశ్ క‌నిపించారు. అదే స‌మ‌యంలో.. మంత్రి కేటీఆర్ చెమ‌ట‌లుకారుతూ.. ముఖం అల‌స‌ట‌తో ఉండ‌టం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో హ‌రీశ్ కు ప్రాధాన్య‌త లేద‌న్న విష‌యం ఆయ‌నకు అప్ప‌జెప్పిన ప‌నుల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పొచ్చు.