Begin typing your search above and press return to search.

హ‌రీశ్ మీద అభిమానం తెలంగాణాను దాటేసిందే!

By:  Tupaki Desk   |   4 Jun 2019 1:29 PM IST
హ‌రీశ్ మీద అభిమానం తెలంగాణాను దాటేసిందే!
X
త‌మ ప్రాంతం మీద కంటే కూడా త‌మ కులానికి.. త‌మ వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చే జాతిగా ఆంధ్రోళ్ల‌ను చెప్పాలి. తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఎవ‌రిని క‌దిపినా వారికి.. వారి ప్రాంతం మీద ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. వారి ప్రాంత ప్ర‌యోజ‌నాల త‌ర్వాతే మ‌రే ప్రాధాన్య‌త కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. అందుకోసం దేనికైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తుంది.

తెలంగాణ ప్ర‌జ‌ల్లో మ‌రో తీరు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంది. తెలంగాణ సాధ‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబును ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌ట‌మే కాదు.. తెలంగాణ రాకుండా అడ్డుప‌డ్డార‌ని బ‌లంగా న‌మ్ముతారు. ఈ కార‌ణంగానే మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌లో బాబు ప్ర‌చారానికి వ‌చ్చిన దానికి బ‌దులుగా టీఆర్ ఎస్ కు ఓటేసిన వైనం క‌నిపిస్తుంది. విభ‌జ‌న త‌ర్వాత ఏ ఏపీ ప్రాంతానికి చెందిన నేత పుట్టిన‌రోజు వేడుక‌లు కానీ.. మ‌రేదైనా వేడుక‌లు కాని తెలంగాణ‌లో క‌నిపించ‌వు.

అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు మొద‌లుకొని.. తెలంగాణ‌కు చెందిన ప‌లువురు నేత‌లను ముఖ్యఅతిధులుగా ఏపీకి పిలిచి స‌త్కారాలు చేయ‌టం క‌నిపిస్తుంది. ఇవాల్టి రోజున ఉన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌.. సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ ను భుజాన వేసుకున్న‌ట్లుగా క‌నిపించ‌టానికి చాలామంది నేత‌లు ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొంద‌రు టీఆర్ ఎస్ నేత‌లు మాత్రం అందుకు భిన్నంగా హ‌రీశ్ మీద ఉన్న అభిమానాన్ని పేప‌ర్ల‌లో ప్ర‌క‌ట‌న‌ల రూపంలో ఇచ్చారు. అయితే.. ఈ సంఖ్య చాలా చాలా త‌క్కువ‌గా చెప్పాలి.

దీనికి భిన్నంగా ఏపీలో హ‌రీశ్ పుట్టిన‌రోజు వేడుక‌లు నిర్వ‌హించ‌టం విశేషం. తిరుప‌తిలో హ‌రీశ్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని రెండు వంద‌ల వ‌ర‌కు అనాధ పిల్ల‌ల‌కు అన్న‌దానం నిర్వ‌హించిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. హ‌రీశ్ రావు ఏపీ అభిమాన సంఘం అధ్య‌క్షుడు పోల్తి ప్ర‌తాప‌రావు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. రాష్ట్ర విభ‌జ‌న‌లో కీల‌క భూమిక పోషించిన హ‌రీశ్ రావుకు ఏపీలో.. ఏపీ హ‌రీశ్ రావు అభిమాన సంఘ‌మా? ఇలాంటివి ఏపీకి.. ఆంధ్రోళ్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మేమో?