Begin typing your search above and press return to search.
ఒక్క ఇళ్లు కట్టని ఈటల గెలిస్తే ఏం చేస్తారు?: మంత్రి హరీష్
By: Tupaki Desk | 4 Sep 2021 2:30 PM GMTహుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఉపఎన్నికలకు పార్టీలన్నీ ముందస్తుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రచార పర్వంలో నేతలు బిజీ అయిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును భుజాన వేసుకున్న మంత్రి హరీష్ రావు పల్లె పల్లెలో పర్యటిస్తున్నారు.
ప్రతిరోజు హరీష్ గ్రామాల్లో తిరుగుతూ టీఆర్ఎస్ కు ప్రజల మద్దతు కూడగడుతున్నారు. టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని.. కేసీఆర్ హయాంలో చేపట్టిన పనులను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.
మరోవైపు మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన స్వార్థం కోసం ఈటల రాజేందర్ రాజీనామా వల్ల ఉప ఎన్నిక వచ్చిందన్న హరీష్ .. మంత్రిగా పేదల కోసం ఒక్క ఇళ్లు కట్టని ఈటల గెలిస్తే.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఇళ్లు నిర్మించి ఇస్తారా? అని ప్రశ్నించారు. వ్యక్తి ప్రయోజనమా? హుజూరాబాద్ ప్రజల ప్రయోజనాలా? ఆలోచించి ఎన్నుకోవాలన్నారు.
నిరంతరం ప్రజల కోసం పనిచేసే సీఎంకు హుజూరాబాద్ గెలుపు కానుకగా ఇద్దామని హరీష్ పిలుపునిచ్చారు. మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని మంత్రి హరీష్ ప్రజలకు హామీ ఇచ్చారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కులవృత్తులను బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇందుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు.
దేశంలోనే పంజాబ్ ను వెనక్కి నెట్టి తెలంగాణ వరిపంట ఉత్పత్తిలో తొలి స్థానంలో నిలిచిందన్నారు. యాసంగిలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పంట పండించి తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ దూరదృష్టి, ప్రణాళిక వల్లే సాధ్యమైందన్నారు.