Begin typing your search above and press return to search.
ఆత్మలతో కేసు వేయించారన్న హరీశ్ రావు
By: Tupaki Desk | 3 Nov 2016 4:32 AM GMTపదునైన విమర్శలకు పెట్టింది పేరయిన తెలంగాణ సీఎం కేసీఆర్ మేనల్లుడు - భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు ప్రతిపక్షాలపై విరుచుకు పడే క్రమంలో సరైన ఆధారాలు దొరికితే ఎలా ఉంటుంది? చెడుగుడు ఆడుకోవడం అనేది కొత్తగా చెప్పక్కర్లేదు కదా. అదే స్థాయి విమర్శలను తాజాగా ప్రతిపక్ష కాంగ్రెస్ పై ఎక్కుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా తనను ఇరుకున పెట్టిన మల్లన్నసాగర్ లో కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో హరీశ్ రావు మండిపడ్డారు.
సొంత జిల్లా సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతు రక్షణ సమితి జిల్లా శాఖ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నించిందని అన్నారు. చనిపోయిన వారి పేరుతో - వేలిముద్రలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ప్రాజెక్టును అడ్డుకునేలా కుట్ర పన్నిందని మండిపడ్డారు. ‘మాసుల సత్యనారాయణ - మాసుల రామచంద్రం అనే వ్యక్తులు రెండేళ్ల క్రితమే చనిపోయారు. ఇటీవల ప్రాజెక్ట్ లను అడ్డుకునే క్రమంలో వీరి పేరిట హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎక్కడైనా చనిపోయిన వారి పేరిట కేసులు వేస్తారా..? మనిషి ఆత్మలు కూడా కేసులు పెడతాయా..? ఇదేక్కడి విచిత్రం. ప్రతిపక్ష కాంగ్రెస్ దుర్మార్గపు ప్రక్రియకు ఇది పరాకాష్ట. రైతుల ఉసురు వారికి తప్పకుండా తగులుతుంది.చనిపోయిన వారు - ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేరిట ఫోర్జరీ సంతకంతో కాంగ్రెస్ కుట్ర పూరితంగా కేసులు వేసింది. హైకోర్టులో కేసులు వేసిన వైనంపై బహిరంగ చర్చకు సిద్ధమా..?’ అంటూ హరీశ్ ఈ సందర్భంగా టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. తన సవాల్ కు ఉత్తమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే...తాను చేయను - చేయనివ్వను అన్నట్లుగా ఉందని హరీశ్ రావు మండిపడ్డారు. ఇలాంటి తెలంగాణ వ్యతిరేక పార్టీకి సంక్షేమ ప్రభుత్వమైన టీఆర్ ఎస్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని హరీశ్ నిలదీశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/