Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు, జైపాల్ రెడ్డిల చెట్ట‌ప‌ట్టాల్ ఎందుకో?

By:  Tupaki Desk   |   12 Sep 2016 10:56 AM GMT
చంద్ర‌బాబు, జైపాల్ రెడ్డిల చెట్ట‌ప‌ట్టాల్ ఎందుకో?
X
తెలంగాణ‌లో టీఆరెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా విప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న‌లు టీఆరెస్ నేత‌ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. కాంగ్రెస్ - టీడీపీలు రెండూ క‌లిసి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తుతున్నార‌ని టీఆరెస్ ఆరోపిస్తోంది. అంతేకాదు... ఇవ‌న్నీ ఏపీ సీఎం చంద్ర‌బాబు డైరెక్ష‌న్ లో జ‌రుగుతున్నాయ‌ని తెలంగాణ నీటి పారుద‌ల మంత్రి హ‌రీశ్ రావు చేసిన తాజా ఆరోప‌ణ రాజ‌కీయాల్లో కొత్త చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆడించినట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆడుతోందని - ఆయన డైరెక్షన్ లో కాంగ్రెస్ యాక్షన్ చేస్తోందని హరీశ్ రావు ఈరోజు నిప్పులు చెరిగారు.

తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలు కలసి ఆదివారం నాడు ధర్నా చేపట్టాయ‌ని గుర్తు చేసిన హ‌రీశ్ రావు... చంద్ర‌బాబు - కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డిలు క‌లిసి రాజ‌కీయ కుట్ర‌కు తెర‌తీస్తున్నార‌న్న‌ట్లుగా మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టే వద్దని గతంలో వ్యాఖ్యానించిన చంద్రబాబుతో - కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని హ‌రీశ్ చేసిన ఆరోప‌ణ తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు మొద‌ల‌య్యాయా అన్న అనుమానాల‌ను క‌లిగిస్తోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

కాగా... జైపాల్ రెడ్డి గురించి ప్రజలకు బాగా తెలుసని - తెలంగాణ వాసులకు ద్రోహం చేసిన తెలుగుదేశంతో కాంగ్రెస్ ఎందుకు జత కట్టిందని హరీశ్ ప్రశ్నించారు. తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని - భూములు తీసుకోకుండా ప్రాజెక్టులు ఆకాశంలో కడతామా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే, రెండు పంటలకు రైతులకు నీరందుతుందని చెప్పుకొచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా... జైపాల్ - చంద్ర‌బాబులు చెట్ట‌ప‌ట్టాలు వేసుకుని తిరుగుతున్నార‌ని హ‌రీశ్ అన‌డం వెనుక ఏదో ఉంద‌ని వినిపిస్తోంది. రెండు పార్టీలు క‌లిసి త‌మ‌ను దెబ్బ‌తీసేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయ‌ని టీఆరెస్ అనుమానిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. తెలంగాణ‌లో టీడీపీ దెబ్బ‌తిన‌డం.. రేవంత్ త‌ప్ప ఎవ‌రూ యాక్టివ్ గా లేక‌పోవ‌డం.. కాంగ్రెస్ లోనూ త‌లో దారిన సాగుతుండ‌డంతో మంచి పేరున్న జైపాల్ రెడ్డితో క‌లిసి చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా టీఆరెస్ అనుమానిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. జైపాల్ రెడ్డి - రేవంత్ రెడ్డి కాంబినేష‌న్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆరెస్ తో త‌ల‌ప‌డేందుకు స్కెచ్ రెడీ అవుతున్న‌ట్లుగా తెలుస్తోంది.