Begin typing your search above and press return to search.

పంటమార్పిడిపై హరీష్ రావు కామెంట్స్

By:  Tupaki Desk   |   23 May 2020 5:03 PM GMT
పంటమార్పిడిపై హరీష్ రావు కామెంట్స్
X
రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని.. రైతుల ప్రయోజనాల కోసమే పంటమార్పిడి విధానం తీసుకొచ్చామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతుబంధుకు ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ సూచనల మేరకు రైతులు పంటమార్పిడి చేసుకోవాలని.. రైతులతో పంటు వేయించాల్సిన బాధ్యత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులదేనని స్పష్టం చేశారు.

ఒకే పంట వేస్తే దిగుబడి తగ్గడంతోపాటు భూమిలో సారం ఉండదని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతులు ముందే ఎరువులు తీసుకెళ్లాలని సూచించారు. భూమిలో రసాయనాలు పరీక్షించి పంటలు ఏవి వేయాలనేది ఏఈవోలు సూచించాలన్నారు.

ఈ వానాకాలంలో మొక్కజొన్న వేయవద్దని.. యాసంగిలో మక్క పంట వేయాలని హరీష్ సూచించారు.కేసీఆర్ సూచనలు పాటించాలన్నారు. వానాకాలంలో పంటమార్పిడి జరగాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది అధికంగా పత్తి సాగుచేయాలని.. దాంతోపాటు కంది, పెసర, పప్పు దినుసులు వేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు.

కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ లో రైతుబంధు వేదికల నిర్మాణం కోసం నిధులు ఇచ్చారని.. 116 వేదికలకు 20 లక్షల చొప్పున ఇచ్చారని తెలిపారు.