Begin typing your search above and press return to search.
ఒక్కసీటు విషయాన్ని మర్చిపోతే ఎట్లా హరీశ్?
By: Tupaki Desk | 5 April 2016 5:00 AM GMTసిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాంచి హుషారు మీద ప్రచారం చేస్తున్నారు. ఎర్రటి ఎండలతో మంటలు పుడుతున్నా.. ఆయన మాత్రం వాటినేమాత్రం పట్టించుకోవటం లేదు. తాను అనుకున్నట్లు.. సిద్ధిపేటలో టీఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే.. ఏ మాత్రం విరామం తీసుకోకుండా ఆయన అదే పనిగా ప్రచారం చేస్తున్నారు.
మరీ.. పని ఒత్తిడి పెరిగిపోవటమో.. అదే పనిగా ప్రచారం చేయటమో కానీ.. కొన్ని విషయాన్ని హరీశ్ మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. సోమవారం చేసిన ప్రచారాన్నే తీసుకుంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అని అయిపోయిందని.. ఆ పార్టీ ఆంధ్రాకి వెళ్లిపోయిందని స్టేట్ మెంట్ ఇచ్చేసిన హరీశ్.. చేయి గుర్తు పని అయిపోయిందంటూ ఎక్కెసం చేశారు. ఇంతవరకూ ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే.. ఇవాల్టి రాజకీయాల్లో ఈ తరహా వ్యాఖ్యలు మామూలే కాబట్టి. కానీ.. అభ్యంతరం అంతా ఆ తర్వాత మాటలతోనే.
ఎందుకంటే.. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్ని ప్రస్తావించిన హరీశ్.. ఏపీ సీఎం చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని తిరిగినా.. ర్రేటర్ లో ఒక్క సీటు కూడా రాలేదని వ్యాఖ్యానించారు. ఎంత ఊపు మీద ఉంటే మాత్రం.. తమకు వచ్చిన ఒక్క సీటును కూడా హరీశ్ మర్చిపోవటంపై తెలంగాణ తెలుగుదేశం నేతలు గుస్సా అవుతున్నారు. హరీశ్ లాంటి లీడరు.. ఇలాంటి లెక్కల్ని మర్చిపోవటం బాగోదేమో.? గ్రేటర్ ప్రచారంలో పాల్గొనకపోయేసరికి హరీశ్ గెలుపు లెక్కల్ని పెద్దగా రిజిష్టర్ చేసుకోలేదా ఏంటి..?