Begin typing your search above and press return to search.
మహేశ్‌బాబు డైలాగ్‌ను వాడిన హరీశ్ రావు
By: Tupaki Desk | 20 July 2015 3:28 PM GMTమహేశ్ బాబు సూపర్ డూపర్ సినిమా పోకిరిలో ఆయన తండ్రి పాత్రలో ఉన్న నాజర్ చెప్పే డైలాగ్...నా కుమారుడు సమాజంలో ఉన్నారు. సమాజం కోసం వ్యవసాయం చేస్తున్నాడు.అంటూ.. అసలు రూపంలో ఉన్న ప్రిన్స్ గురించి చెప్తున్న సీన్ బాగా పండిన సంగతి తెలిసిందే. తాజాగా అదే డైలాగ్‌ను తెలంగాణ రాష్ర్ట మంత్రి హరీశ్ రావు ఉపయోగించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌కు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంజినీర్ అవతారమెత్తి రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పట్టుపడితే పనులు ఆగవని, పాలమూరు ఎత్తిపోతల పూర్తయితేనే జిల్లా ప్రజల గోస తీరుతదన్నారు. పాలమూరు ఎత్తిపోతల వల్ల ఎక్కువగా ఉపయోగం పొందేది కొడంగల్ అన్నారు.
కొడంగల్ ప్రజలు మొక్కజొన్నలు, జొన్నలు పండించాల్సిన అవసరంలేదని చెప్పారు. త్వరలో కొడంగల్ రైతులు వ్యవసాయం చేసుకుంటారని....సన్న బియ్యం పండించబోతున్నారని ప్రకటించారు. కొడంగల్, నారాయణపేట, గద్వాల్‌లో ఉన్నది కూడా తెలంగాణ ప్రజలేనని, అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకున్నా రోడ్లు వేయించాలని కేసీఆర్ చెప్పారని హరీశ్ రావు అన్నారు.
మొత్తంగా టీడీపీలో కీలక ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ మహిళానాయకురాలిగా ఉన్న డీకే అరుణకు ఘాటు కౌంటర్ ఇచ్చేలా హరీశ్‌రావు మాట్లాడారు. ఈ క్రమంలో తనదైన శైలిలో హరీశ్‌రావు పంచ్‌లు పేల్చారు.