Begin typing your search above and press return to search.
బాబు క్షమాపణ చెప్పకుంటే..నిరసనలు తప్పవు
By: Tupaki Desk | 2 Jun 2017 2:59 PM GMTకాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిన్న జరిగిన సంగారెడ్డి కాంగ్రెస్ సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టీఆర్ ఎస్ పాలనపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నేడు తెలంగాణ విభజన అమల్లోకి వచ్చిన రోజు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చీకటిరోజుగా అభివర్ణించారు. ఈ ఇరువురు నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ స్పందిస్తూ ఘాటుగా రియాక్టయ్యారు. సంగారెడ్డి సభలో రాహుల్ గాంధీ జాతీయస్థాయి నాయకుడిలా మాట్లాడలేదన్నారు. ఆయన మాటల్లో అనుభవ రాహిత్యం కనిపించిందని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ భిక్ష కాదు.. శాసించి తెచ్చుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను రాహుల్ చదివి వినిపించారని అలాకాకుండా పల్లెల్లో తిరిగి చూస్తే రాహుల్ కు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ది కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ కు చరిత్ర తప్ప భవిష్యత్ లేదన్నారు. కాంగ్రెస్ చేసిన పాపం వల్ల రైతుల ఆత్మహత్యలని మండిపడ్డారు. కుటుంబ పాలన గురించి నెహ్రూ ఫ్యామిలీకి అడిగే హక్కు లేదన్నారు.
నవనిర్మాణ దీక్షల పేరుతో తెలంగాణపై చంద్రబాబు మరోసారి అక్కసు వెళ్లగక్కారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినం ఏపీకి చీకటిరోజు అన్న చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులకు చీమూ నెత్తూరు ఉంటే చంద్రబాబు వ్యాఖ్యల పట్ల స్పందించాలన్నారు. లేకపోతే భవిష్యత్‌లో తెలంగాణ ప్రజల నుంచి నిరసనలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు చూడలేడని హరీశ్ రావు అన్నారు. అభివృద్దిలో పోటీ పడలేకే విభజన పేరుతో తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, ఆయన మిత్రమైపక్షమై బీజేపీ డిమాండ్ చేయాలన్నారు.
మీడియా సమావేశంలో ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావాన్ని పండుగలా చేసుకుంటుంటే చంద్రబాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణపై చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారన్నారు. తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఈ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఊసరవెల్లిలా మాట్లాడుతున్న చంద్రబాబును తెలంగాణ ప్రజలు నమ్మరని మండిపడ్డారు. టీటీడీపీ నేతలు ఇప్పటికైనా చంద్రబాబు వంచన నుంచి బయటపడాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/