Begin typing your search above and press return to search.
అలా చేస్తేనే ఉద్యోగాలు వస్తాయా హరీశ్?
By: Tupaki Desk | 7 Sep 2015 7:23 AM GMTఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన రాజకీయ పార్టీకి కానీ అధికారంలోకి వస్తే వ్యవస్థలో చాలా మార్పులు వస్తాయని అనుకునేవారు. ఇక.. కేసీఆర్ లాంటి తెలివైన ఉద్యమనేతకు కీలకపదవి చేతికి చిక్కితే దాని వ్యవస్థలో మార్పులు రావటం ఖాయమన్న మాట తెలంగాణ ఉద్యమ సమయంలో తరచూ వినిపించేది.
పలు అంశాల మీద పట్టుండటంతో పాటు.. వ్యవస్థలో చోటు చేసుకోవాల్సిన మార్పుల గురించి గంటల కొద్దీ క్లాసులు పీకే కేసీఆర్ కానీ సీఎం అయితే.. చాలానే అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న భావన వ్యక్తమయ్యేది. ప్రజల ఆకాంక్షతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతులు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఉద్యమనేత ముఖ్యమంత్రి అయితే పాలనలో చాలానే మార్పులు చోటు చేసుకుంటాయని ఎంతగానో ఆశ పడిన వారికి.. అందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకోవటం ఒకపట్టాన అర్థం కావటం లేదు. సంప్రదాయ రాజకీయ పార్టీలకు తగ్గట్లుగానే విపక్షాలపై విరుచుకుపడటం.. దూకుడు రాజకీయాల్ని పీక్ స్టేజ్ కి తీసుకెళుతున్నట్లుగా టీఆర్ ఎస్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అందుకు తగ్గట్లే ఆ పార్టీకి చెందిన కీలక నేత.. మంత్రి హరీశ్ రావు మాటలు ఇప్పుడు మంటపుట్టిస్తున్నాయి.
తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయటం.. దాన్ని విరమించుకోవాలని సీఎం కేసీఆర్ కోరటం.. కొందరు ఓకే చెప్పేసి వెనక్కి తగ్గితే.. మరికొందరు మాత్రం మాట వినకుండా కమ్యూనిస్టు పార్టీ నేతలు చెప్పినట్లుగా ఆందోళన చేయటం.. వారి ఉద్యోగాలు తీసేయటం తెలిసిందే. అలా ఉద్యొగాలు కోల్పోయిన వారు తాజాగా మంత్రి హరీశ్ ను కలుసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కమ్యూనిస్టు నేతల ఇళ్ల ముందు ధర్నా చేస్తే విషయాన్ని తాను చూస్తానని హామీ ఇవ్వటం గమనార్హం. ఎర్రజెండాలోళ్ల మాట విని మోసపోయారని మండిపడ్డ హరీశ్.. వారి ఇళ్ల వద్ద పోరాటం చేయాలని వ్యాఖ్యనించారు.
మంత్రిగారి నుంచి వస్తున్న మాటలతో నోట మాట రాని పారిశుద్ధ్య కార్మికులు.. చేసిన ఉద్యమాన్ని వదిలేసి.. తాము తప్పు చేసినట్లుగా.. ఎర్రజెండాలోళ్ల మాట విని మోసపోయినట్లుగా వ్యాఖ్యల్ని కార్మికుల నోట వెంట విన్న వెంటనే.. సమస్య పరిష్కారం కోసం తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. చూస్తుంటే తమకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వారి డిమాండ్లను తీర్చకుండా ఉండటం.. ఉద్యమాలు చేయించిన పార్టీల మీద ప్రతీకారం తీర్చుకునేలా మాట్లాడటం చూస్తుంటే.. పోయిన ఉద్యోగాలు తిరిగి రావాలంటూ ఏం చేయాలన్న విషయాన్ని పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్ చెప్పకనే చెప్పినట్లుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.