Begin typing your search above and press return to search.
హరీశ్ గెలిచాడు...కేటీఆర్ ఓడాడు
By: Tupaki Desk | 24 May 2019 6:56 AM GMTతెలంగాణ ఎన్నికల్లో వచ్చిన ఆసక్తికర ఫలితాల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీజేపీ ఓటమి...మెదక్ పార్లమెంటు స్థానంలో భారీ ఓట్లతో గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు స్థానాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ - ఆయన మేనల్లుడు హరీశ్ రావు మధ్య జరిగిన చాలెంజ్. రాష్ట్రంలో లోక్ సభ రిజల్ట్స్ పై బావా బామ్మర్దుల సవాల్లో బావదే పై చేయి అయింది. మెదక్ ఎంపీ స్థానంలో టీఆర్ ఎస్ క్యాండిడేట్ కు వచ్చే మెజార్టీ కన్నా కరీంనగర్ ఎంపీ సీట్లో ఒక్క ఓటైనా ఎక్కువ సాధిస్తామన్న టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలెంజ్ బుడగలా పేలిపోయింది. ఏకంగా అభ్యర్థి ఓడిపోయారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మార్చి 8న మెదక్ లో టీఆర్ ఎస్ ఎన్నికల సన్నాహక సభ జరిగింది. ఆ సభలో మాజీ మంత్రి - ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ...మెదక్ ఎంపీ స్థానంలో ఐదు లక్షల మెజారిటీ సాధిస్తామని చెప్పారు. తర్వాత కేటీఆర్ మాట్లాడారు. ‘‘నేను ఈ రోజు సవాల్ విసురుతున్నా. ఎంపీ ఎన్నికల్లో మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకువచ్చి రుజువు చేసుకోవాలి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ లోక్ సభ స్థానంలో కంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న కరీంనగర్ ఎంపీ సీటులో ఒక్క ఓటైనా గ్యారంటీగా ఎక్కువ తెచ్చుకుంటాం. మా కరీంనగర్ లీడర్లతో మాట్లాడి తప్పకుండా మీకంటే ఒక్క ఓటైనా ఎక్కువ సాధిస్తం..’’ అని చాలెంజ్ చేశారు. ఈ బావాబామ్మర్దుల సవాల్ అందరినీ ఆకర్షించింది. ఎవరి సవాల్ నెగ్గుతుంది - మెదక్ - కరీంనగర్ ఎంపీ స్థానాల్లో ఎవరు టీఆర్ ఎస్ క్యాండిడేట్లకు ఎక్కువ మెజారిటీ తీసుకువస్తారన్న చర్చ జరిగింది.
అయితే గురువారం వెలువడిన రిజల్ట్ లో బావదే పైచేయిగా నిలిచింది. మెదక్ ఎంపీ స్థానంలో టీఆర్ ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3,16,388 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కరీంనగర్ ఎంపీ సీట్లో టీఆర్ ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మెజార్టీ మాట అటుంచి ఓటమి పాలవడం గమనార్హం. హరీశ్ మూడు లక్షలకుపైగా ఓట్లతో టీఆర్ ఎస్ క్యాండిడేట్ ను గెలిపించి - తన పట్టును చాటుకోగా.. సొంత నియోజకవర్గమున్న కరీంనగర్ సీటును గెలిపించుకోవడంలో కేటీఆర్ విఫలమయ్యారు.