Begin typing your search above and press return to search.
హరీశ్ పై కేసీఆర్ కు ఉన్న నమ్మకానికి హెలీకాప్టరే నిదర్శనం
By: Tupaki Desk | 1 Dec 2018 4:11 AM GMTతెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు తన మేనల్లుడు మంత్రి హరీశ్ రావుపై ప్రత్యేకమైన భరోసా ఉంటుందనే సంగతి తెలిసిందే. పార్టీలో అంతర్గత పరిణామాల విషయం సంగతి పక్కనపెడితే - క్లిష్టమైన సమయాల్లో హరీశ్‌నే కేసీఆర్ నమ్ముకుంటారనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో తాజా పరిణామంగా ప్రత్యేక హెలీకాప్టర్ ఇచ్చి మరీ హరీశ్ రావుతో ప్రచారం చేయించడాన్ని పేర్కొనవచ్చు. నేటి నుంచి మూడ్రోజుల పాటు సుడిగాలి పర్యటనకు హరీశ్‌రావు కోసం పార్టీ ఏర్పాట్లు చేసి ముఖ్య నియోజకవర్గాలన్నింటినీ కవర్ చేయిస్తోంది.
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో హరీశ్ రావు ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు పోటీ చేస్తున్న కొడంగల్ - గద్వాల - అలంపూర్ సెగ్మెంట్లలో మక్తల్ - నాగర్ కర్నూల్ - జడ్చర్ల - పాలకుర్తి - నర్సంపేట - భువనగిరి - మానకొండూరు సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించారు. అయితే, పోలింగ్ గడువు సమీపిస్తున్న సమయంలో మరో 20 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో 4 రోజుల్లో 20 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేయనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు హరీశ్ ప్రచార ప్రణాళిక సిద్ధమైంది.
ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా బహిరంగసభలు - రోడ్ షోల్లో హరీశ్ రావు విస్తృతంగా పాల్గొననున్నారు. శనివారం గాంధారి - సదాశివనగర్ లో - డోర్నకల్ - వర్ధన్నపేట - స్టేషన్ ఘన్ పూర్ - రఘనాథపల్లి సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఆలేరు - భువనగిరి సభలో పాల్గొంటారు. ఆదివారం కరీంనగర్ లో ట్రస్మా సమావేశంలో పాల్గొంటారు. తర్వాత గంగాధర - మానకొండూరు రోడ్ షోలతోపాటు రాత్రి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. కాగా, ఇన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక ఏర్పాట్లతో హరీశ్ రావును పంపించడమే...కేసీఆర్ కు ఆయనపై ఉన్న భరోసాకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.