Begin typing your search above and press return to search.

కేసీఆర్ సమక్షంలో బాబుపై హరీశ్ ఫైర్

By:  Tupaki Desk   |   22 Sep 2016 4:17 AM GMT
కేసీఆర్ సమక్షంలో బాబుపై హరీశ్ ఫైర్
X
ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుతున్నారు. వారి వాదనలు వినటానికి.. సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కేంద్రమంత్రే కూర్చున్నారు. అలాంటి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు. ఈ సన్నివేశం తాజాగా కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వం జరిగిన జల పంచాయితీలో చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్రమంత్రి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీం స్పందించి.. సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పటంతో తాజాగా సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. స్నేహపూర్వకంగా మెదిలితే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు.. స్నేహపూర్వకంగా ఉందామంటూనే మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులకు పుల్లలు పెడుతున్నారని.. అడ్డు తగులుతున్నారంటూ తీవ్ర స్వరంగా రియాక్ట్ అయ్యారు. పాలమూరు.. డిండిలను నిర్మించొద్దంటూ అపెక్స్ కౌన్సెల్ లో ఎలా వాదిస్తారని ప్రశ్నించిన హరీశ్.. స్నేహపూర్వకంగా మెదిలేవారు అలా చేస్తారా? అని క్వశ్చన్ చేయటం గమనార్హం.

ఈసందర్భంగా ఏపీకి తాము ఎంతో సాయం చేశామంటూ పలు అంశాల్ని తెరపైకి తెచ్చిన హరీశ్ రావు మాటల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. హరీశ్ ను కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఓవైపు కేంద్రమంత్రి.. మరోవైపు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్న సమయంలో కేసీఆర్ జట్టు సభ్యుడిగా వెళ్లిన మంత్రి హరీశ్ దూకుడు ప్రత్యేక చర్చగా మారింది.