Begin typing your search above and press return to search.
వారిని పందికొక్కులన్న హరీశ్
By: Tupaki Desk | 22 March 2016 4:44 AM GMTఅసెంబ్లీ సమావేశాలంటే చాలు నేతల నోటికి అడ్డూఆపూ ఉండదు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే నేతలకు కొదవ ఉండదు. ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేందుకు ఎలాంటి మాటను అనేందుకు సైతం వెనుకాడరు. సంయమనంతో వ్యవహరించాలన్న ధ్యాస అస్సలు ఉండదు. దీనికి అధికార.. విపక్ష నేతలు మినహాయింపు కాదు.
తాజాగా తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన తాజా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. తాజాగా ఆయనకు విపరీతమైన ఆవేశం వచ్చేసింది. ఇందిరమ్మ ఇళ్లు.. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై జరిగిన చర్చ సందర్భంగా హరీశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు హరీశ్.. ఇళ్ల పేరిట పందికొక్కుల్లా బొక్కేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వారికి భిన్నంగా తాము పారదర్శకంగా ఇళ్లు నిర్మిస్తామని చెబుతుంటే వాకౌట్లు చేస్తున్నారన్న హరీశ్.. ఉప ఎన్నికల్లో తీర్పు చూసి కూడా విపక్షాలు గుణపాఠం నేర్చుకోలేదంటూ ధ్వజమెత్తారు. విపక్షాలు ఇలానే చేస్తే రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపోటములు శాశ్వితం కాదన్న విషయం హరీశ్ కు చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ ఎస్ ప్రస్థానంలో ఎన్నికల్లో భారీ గెలుపులు.. భారీ ఓటములు ఎన్నో చూసిన విషయాన్ని మర్చిపోకూడదు. టైం కలిసి రావాలే కానీ.. అదృశ్యమయ్యే పార్టీ కూడా అధికారపక్షంగా మారుతుందన్న విషయం హరీశ్ మర్చిపోవటం ఏమిటో..?