Begin typing your search above and press return to search.
వారి మైత్రికి పునాది మీ చేతకానితనమే కదా
By: Tupaki Desk | 12 Oct 2015 3:48 AM GMTతెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలుకలసి తెలంగాణలో ఒక ఉద్యమం నడిపాయంటే.. అధికార పక్షానికి ఉలికిపాటు ఎదురవతున్నట్లుగా ఉంది. అంత అనైతికంగా వారిద్దరూ ఎలా కలిశారని తెరాస నేతలు నిలదీస్తున్నారు. అయితే.. అలా బద్ధ శత్రువులైన ఆ రెండు పార్టీలు కలసి పోరాడడానికి అవకాశం ఇచ్చింది.. తమ పార్టీ పరిపాలనలోని అసమర్థత మాత్రమే అని వారు ఎందుకు గుర్తించలేకపోతున్నారో తెలియడం లేదు.
తెలంగాణ ప్రాంత అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు అడుగడుగునా అడ్డుపడిన చంద్రబాబు పార్టీతో ఎలా జత కట్టారంటూ రాష్ట్ర భారీ నీటిపారుదల - మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి - జానారెడ్డిలే ఈ విషయంలో ప్రజలకు సమాధానమివ్వాలని హరీష్ నిలదీశారు. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల పర్యటించిన కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిపై రాళ్లదాడి చేసిన టీడీపీతో.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జతకట్టడం ఎంత వరకు సమంజసమని హరీష్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ తన సిద్ధాంతాలను గాలికొదిలి.. కాంగ్రెస్ తో జత కలవడం విడ్డూరంగా ఉందన్నారు.
డిండి - పాలమూరు ప్రాజెక్ట్ ల నిర్మాణానికి అడ్డుపడటమే కాకుండా లోయర్ సీలేరు ప్రాజెక్ట్ నుంచి రావాల్సిన విద్యుత్ ను రాకుండా చేసింది.. చంద్రబాబు కాదా? అని హరీశ్ ప్రశ్నించారు. 68 ఏళ్ల కాంగ్రెస్ - టీడీపీ పాలనలో రైతుల బతుకు చితికి పోయిందని హరీష్ రావు ఆరోపించారు.
హరీష్ రావు, ఇతర టీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ - టీడీపీల ఐక్యత గురించి విమర్శించడానికి తగిన కారణముంది. తెలంగాణ ప్రభుత్వం రైతు ఆత్మహత్యలపై మొసలి కన్నీరు కారుస్తూ నిర్దిష్ట హామీలు ఇవ్వకుండా చర్చలు జరిపామంటే జరిపామన్న చందాన వ్యవహరిస్తూ అడ్డొచ్చిన ప్రతిపక్ష పార్టీలను సస్పెండ్ చేస్తూ నిరంకుశత్వంతో వ్యవహరించడం తెలంగాణ ప్రతిపక్షాలను ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఒక్కటి చేసింది. ప్రభుత్వం ఏమాత్రం ఊహించని విధంగా ప్రతిపక్షాలన్నీ కలిసి 10వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపివ్వడం, దాన్ని విజయవంతం చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నించడం ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టింది. ఈ ఐక్యత భవిష్యత్ నూతన సమీకరణలకు పునాది కల్పించిందని అర్థం కావటంతో చంద్రబాబును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలను డిఫెన్స్ లో పడవేయడానికి తెరాస నేతలు ప్రయత్నించారు.
అయినా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాటం సాగిస్తున్నకాలంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చట్టపట్టాలు వేసుకుని ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన విషయం తెరాస నేతలు మర్చిపోతే ఎలా? ఐదేళ్ల చరిత్రను విస్మరించి ఇవ్వాళేదో ఈ రెండు పార్టీల మధ్య అపవిత్ర కూటమి ఏర్పడినట్లు గావుకేకలు వేయడం దేనికీ?