Begin typing your search above and press return to search.
హరీశ్ రావు కడిగేస్తాడట!
By: Tupaki Desk | 9 Dec 2016 6:43 AM GMTరైతుల ఆత్మహత్యలు, వలసలు నివారించడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టాలని మంచి ప్రయత్నంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంటే...కాంగ్రెస్ వాళ్లు కేసులతో అడ్డుకట్ట వేస్తున్నారని సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి తప్పులన్నింటిని ఎత్తి చూపించి అసెంబ్లీలో సబ్బుతో కడిగినట్లు కడిగేస్తానని ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.
సింగూరు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు (మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ) ఎకరాకు 2.15 లక్షల నుంచి 2.60 లక్షలు ఇచ్చారని గుర్తుచేసిన హరీశ్ రావు... తెలంగాణ ప్రభుత్వం రూ. 8 నుంచి రూ.10 లక్షలు ఇస్తామంటే తక్కువ వస్తున్నాయంటూ రైతులను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు లేక, సాగు నీరు అందక ఎడారిగా మారిన తెలంగాణాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు కదిలితే కాళ్లలో కట్టెలు పెట్టి అడ్డుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. చనిపోయిన వారి పేర్లపై వేలి ముద్రలు వేసి కోర్టుల్లో దావాలు వేయించారని, అలాంటి కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేసేందుకు పూర్తి ఆధారాలను సేకరించామని, డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సబ్బు పెట్టి కడిగిస్తానని హరీశ్ రావు పేర్కొన్నారు. ఎనిమిదేళ్లు పెద్ద కుర్చీలో కూర్చున్న పెద్దమనిషి కాలువల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి ఎన్నికల సమయంలో చెరువులు నింపే ప్రయత్నం చేస్తే కట్టలన్ని ఎక్కడికక్కడే తెగిపోయాయన్నారు. కాంగ్రెస్ నేతల చిట్టాను విప్పి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టి ప్రజలకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా సింగూర్‌కు అనుసందానం చేసి 360 రోజులు నీరు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని హరీశ్ రావు తెలిపారు.