Begin typing your search above and press return to search.
చరిత్ర తెలుసుకోమంటున్న హరీశ్ రావు
By: Tupaki Desk | 9 July 2016 11:42 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత - రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ పై నీటి పారుదల - మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబ పాలనపై దిగ్విజయ్ సింగ్ మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబ పాలన కింద ఉన్న దిగ్విజయ్ తెలంగాణలో కుటుంబ పాలన ఉందనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ అవినీతి పాలనను చూసి జనం చిత్తుచిత్తుగా ఆయనను ఓడించారని గుర్తుచేశారు.
దిగ్విజయ్ సోయి లేకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. దిగ్విజయ్ కుటుంబ మంతా ప్రజా ప్రతినిధులేనని, తాము ఆయన కుటుంబంలా నామినేట్ కాలేదని హరీశ్ రావు చెప్పారు. తాము 14 ఏళ్లు ఉద్యమంలో పోరాడామని - జైల్లో ఉన్నామని - తరువాత ఎన్నికల్లో గెలిచామని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులను కొనే చరిత్ర కాంగ్రెస్ దేనని చెప్పారు. 2014లో దిగ్విజయ్ సమక్షంలోనే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నుంచి 2014లో ఆ పార్టీ అధికారం పోయేవరకు అందరూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వారేనని ఆయన విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని హరీశ్ రావు చెప్పారు.
రాష్ట్ర ప్రజలు ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెబుతున్నా కాంగ్రెస్ కు సోయి రావడం లేదని హరీశ్ రావు అన్నారు. పేదలకు రూ. 1000 పెన్షన్ ఇవ్వడం దుబారానా? షాదీ ముబారక్ అమలు చేయడం దుబారానా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌కు కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులన్నింటినీ వివాదాల్లో ఇరికించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కోటి ఎకరాలకు నీరందిస్తామని ఆయన చెప్పారు.