Begin typing your search above and press return to search.

ఈటలను ఇరికించేలా హరీష్ రావు హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   31 Aug 2021 2:30 AM GMT
ఈటలను ఇరికించేలా హరీష్ రావు హాట్ కామెంట్స్
X
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ తన పాత మిత్రుడు.. ఇప్పుడు శత్రువు అయిన ఈటల రాజేందర్ ను ఇరికించేలా మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈటలను అదును చూసి హరీష్ దెబ్బకొడుతున్నాడు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి పట్టుదలతో టీఆర్ఎస్ పనిచేస్తోంది. అధికార పార్టీ ఇక్కడ బీజేపీని ఓడించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ట్రబుల్ షూటర్ హరీష్ రావు దగ్గరుండి మరీ ఇక్కడ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఎదురుదాడి చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పలువురు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. '2003లో ఈటల పార్టీలో చేరకముందే ఈ ప్రాంతం గులాబీ మయమైందన్నారు. టీఆర్ఎస్ లోకి ఈటల వచ్చి గెలిస్తే ఆయన వెంట మేము ఉన్నామని తెలిపారు. ఈటల పార్టీ నుంచి వెళ్లిపోతే ఎవరూ వెంట వెళ్లలేదని.. టీఆర్ఎస్ లోకి ఒక్కడే వచ్చిండు.. ఒక్కడే వెళ్లిండు అని హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

''మద్యం, పైసలు పంచాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నడు.. మరి ఇప్పుడు అన్ని పంచేది ఎవరు? ఈటల రాజేందర్ కాదా? ఓటుకు పదివేలు ఇస్తా అని ఈటలే అంటున్నాడంటా'' అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎకరం అమ్మితే ఎన్నికలు కొట్లాడుతా అని ఆనాడే చెప్పిండు.. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే అభివృద్ధి అయితది.. కానీ ఈటల గెలిస్తే అభివృద్ధి అయితదా? దొడ్డు వడ్లు కొనమని.. యూరియా ధరలు పెంచుతామని.. మోటార్లకు మీటర్లు పెడుతామని బీజేపీ అంటోంది.. ఒక్క రైతు కూడా బీజేపీకి ఓటెయ్యడు అని హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా బీజేపీపై ముసలి పులి కథ చెప్పి హరీష్ రావు అలరించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటూ పోవడమే బీజేపీ అభివృద్ధి అని.. బీఎస్ఎన్ఎల్ ను ప్రైవేటు పరం చేసి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారన్నారు.