Begin typing your search above and press return to search.
బుల్లెట్ దిగిందా లేదా అంటున్న హరీశ్ రావు
By: Tupaki Desk | 28 May 2016 8:12 AM GMTడైనమిక్ నాయకుడిగా పేరున్న తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తనదైన శైలిలో అధికారులకు దడ పుట్టించారు. సాగునీటి పారుదల శాఖను చూస్తున్న హరీశ్ తన శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోకిరి సినిమాలో మహేశ్‌బాబు ఉపయోగించిన "ఎప్పుడొచ్చామన్నది కాదు..బుల్లెట్ దిగిందా లేదా?" అనే డైలాగ్ హరీశ్ ఉపయోగించారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాల్లో సాగునీటి ప్రాజెక్టులు కీలకమనే సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర పనుల విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో భాగంగా హరీశ్ రావు అధికారులపై ఫైరయ్యారు.'గతంలోలాగా కాకమ్మ కథలు చెప్తే వినేందుకు, ఊ కొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నేను ప్రాజెక్టుల విషయంలో సీరియస్ గా ఉన్నామనే విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడు మొదలెట్టామనేది కాదు...పంట కాలానికి రైతుకు నీరు ఇస్తున్నామ లేదా అనేదే కీలకం' అంటూ ఫైరయ్యారు.
మంత్రిగారి ఆగ్రహావేశాలను చూసి అధికారులు తమ పనులను మరింత వేగవంతం చేస్తామని స్పష్టంగా చెప్పారట. అయితే భారీగా ఉన్న పని ఒత్తిడితో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామే తప్ప జాప్యం చేయాలని తమకేమీ లేదని నీటిపారుదల ఉద్యోగులు చెప్తున్నారు.