Begin typing your search above and press return to search.
ఇప్పుడు జైరాం.. రేపు సోనియా!
By: Tupaki Desk | 16 March 2015 12:30 PM GMTతెలంగాణ అసెంబ్లీలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన జైరాం రమేశ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. తెలంగాణకు ఆయన అన్యాయం చేశారని దునుమాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు మండలాలతోపాటు దిగువ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టు పోవడానికి ఆయనే కారణమని మండిపడ్డారు.
అయితే, సీమాంధ్రకు అన్యాయం చేసిన జైరాం రమేశ్‌కు ఇలా కావాల్సిందేనని సీమాంధ్ర నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి, తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది జైరాం రమేశ్ మాత్రమే. సోనియా ఆదేశాల మేరకు అన్ని అడ్డంకులను తొలగించి రాత్రింబవళ్లు కష్టపడి, వివిధ పార్టీ నాయకులను ఒప్పించి, కాంగ్రెస్ సీమాంధ్ర నాయకులను తప్పించి, పార్లమెంటులో బౌన్సర్లను పెట్టి మరీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కారణమయ్యారు. ఒక సందర్భంలో అయితే, తెలంగాణ బిల్లు కారణంగా తనకు నిద్ర, ప్రశాంతత కరువయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత అందరికంటే ఎక్కువగా ఊపిరి తీసుకున్నది కూడా ఆయనే.
ఇప్పుడు జైరాం రమేశ్‌ను హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు జైరాం రమేశ్ ఏ స్థాయిలో కృషి చేశారన్న విషయం రెండు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరికీ తెలుసు. రాజకీయ కోణంలో ఆలోచించినా, తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ జైరాం రమేశ్‌కు కూడా తెలంగాన వాదులు కృతజ్ఞతలు చెప్పడం సంస్కారమని, ఆ సంస్కారాన్ని కూడా పాటించకుండా ఇప్పుడు మంచి చేసిన జైరాంపైనే తెలంగాణ నేతలు నిప్పులు చిమ్ముతున్నారని, ఇదేనా వారి సంస్కారమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే కొనసాగితే, నాలుగు రోజులు పోయిన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కూడా టీ నేతలు తిడతారని, అందుకు సిద్ధపడి ఉండాల్సిందేనని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.