Begin typing your search above and press return to search.
అచ్చం మామ బాటలో నడుస్తోన్న మేనల్లుడు
By: Tupaki Desk | 30 May 2017 7:20 AM GMTమేనమామ కేసీఆర్ బాటలో నడుస్తున్నారు మేనల్లుడు హరీశ్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడవటం హరీశ్‌కు అలవాటే. అచ్చం మేనమామ మాదిరే మాటలు చెప్పే హరీశ్.. కేసీఆర్ మాదిరే రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతుంటారు. కాకుంటే.. మేనమామ మాదిరి పిట్టకథలు కాస్త తక్కువ. సీరియస్ అంశాల జోరు ఎక్కువగా ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంటాయి.
మొన్నా మధ్య తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్ర సర్కారుపై తీవ్ర విమర్శలు చేయటం.. దీనికి బదులుగా ఘాటైన సమాధానాన్ని తనదైన శైలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సంగారెడ్డి పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న హరీశ్.. రాహుల్ కు సూచనతో కూడిన హెచ్చరిక ఒకటి జారీ చేశారు.
రాహుల్ గాంధీ గారూ మీరు సంగారెడ్డికి వస్తే స్వాగతం.. సంతోషమే కానీ స్థానిక కాంగ్రెస్ నేతల మాటలు పట్టుకొని మాట్లాడితే మాత్రం అభాసుపాలవుతారన్నారు. అక్కడితో ఆగితే హరీశ్ ఎందుకంటారు.. తెలంగాణరాష్ట్ర సర్కారు చేస్తున్న మంచిని మంచి అనకుండా మసిపూసి మారేడుకాయ చేస్తే మీ పెద్దరికం పోతుందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తికి.. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక వేరే పార్టీ నుంచి మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తికి సంగారెడ్డి సభ బాధ్యతలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు హరీశ్. అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ అధినేత పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేతల్ని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత.. సాదరంగా స్వాగతం పలికి.. గులాబీ కండువాలు వేసి మరీ పదవులు అప్పగించిన వైనాన్ని హరీశ్ ఎందుకు మర్చిపోతారో. ఏమైనా.. మేనమామ మాదిరి మాటలతో బండి లాగిస్తున్న ఈ మేనల్లుడి జోరు ఇప్పట్లో అయితే ఆగేటట్లు లేదనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/