Begin typing your search above and press return to search.
తెలంగాణ నేతలనూ ఆంధ్రకు తరిమేస్తారట...
By: Tupaki Desk | 20 July 2015 11:36 AM GMT పార్టీలు వేరైనా వారంతా తెలంగాణకు చెందిన నేతలే.. కానీ, తెలంగాణలోని అధికార పక్షానికి చెందిన మంత్రులు మాత్రం ఇతర పార్టీల నేతలు కొందరిని ఆంధ్రకు తరిమితరిమి కొడతామంటున్నారు. అవును... తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు ఇదే హెచ్చరిక జారీచేశారు. తెలంగాణలో పుట్టి ఆంధ్రా నేతల కొమ్ము కాస్తున్న టిడిపి నేతలను ఆ రాష్ట్ర సరిహద్దుల దాకా తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. తెలంగాణ టిడిపి నేతలు ఆంధ్రా నేతల పాటకు వంత పాడుతున్నారని ఆరోపించిన ఆయన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవాలన్న కుయుక్తితో, సిడబ్ల్యూసికి టిడిపి లేఖ ఇచ్చిందని ఆరోపించారు. తక్షణం ఏపీ ఆ లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.
తెలంగాణకు అన్యాయం చేసేలా ప్రవర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నించాలని... లేదంటే వారిని తరిమితరిమి కొడతామంటూ హరీశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూపల్లి కృష్ణా రావుతో కలిసి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే... హరీశ్ వ్యాఖ్యలుపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. పార్టీల పరంగా విభేదాలున్నా తెలంగాణకు చెందినవారిని ఆంధ్రకు తరిమికొడతామనడం ఎంతవరకు కరెక్టని.... ఇది ఎలాంటి సంకేతాలిస్తుందన్న చర్చ జరుగుతోంది. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ వారినైనా ఇక్కడి నుంచి తరిమేస్తాం అని చెప్పకనే చెబుతున్నట్లుగా ఉందంటున్నారు.