Begin typing your search above and press return to search.
ఈటలకు షాకిచ్చిన మంత్రి హరీష్ రావు
By: Tupaki Desk | 22 May 2021 2:30 PM GMTతెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ కు ఇన్నాళ్లు సహచరుడిగా ఉన్న మంత్రి హరీష్ రావు షాకిచ్చారు. ఈటల సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లోనే హరీష్ చక్రం తిప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని.. టీఆర్ఎస్ కేడర్ అంతా పార్టీతోనే ఉన్నారని తాజాగా హూజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.
ఈరోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో కమలాపూర్ మండల నాయకులు భేటి అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని హుజూరాబాద్ నేతలు ప్రకటించారు.కమలాపూర్ నేతలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని వారు తెలిపారు.
ఈటలతో లేమని.. ఈ విషయంలో తామంతా టీఆర్ఎస్ తోనే ఉన్నామని కమలాపూర్ నేతలు స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాగడానికి ప్రజలు మేలు జరగడానికి టీఆర్ఎస్ జెండాతోనే సాగుతామని తెలిపారు.
హుజూరాబాద్ లో ఈటల సొంత మండలం నాయకులను టీఆర్ఎస్ వైపు మళ్లించడంలో హరీష్ చక్రం తిప్పారని అంటున్నారు. హరీష్ ఎంట్రీతోనే అక్కడి ఈటల మద్దతుదారులంతా టీఆర్ఎస్ వైపు మళ్లారని చెబుతున్నారు. ఇన్నాళ్లు సన్నిహితులైన ఈటల, హరీష్ లు ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోవడం చూసి అక్కడి నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీ నుంచి తొలగించగానే ఈటలను ఒంటరిని చేస్తున్న గులాబీ పార్టీ తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.