Begin typing your search above and press return to search.
గమనించారాః హరీశ్ రావుకు ప్రమోషన్
By: Tupaki Desk | 21 Feb 2016 9:27 AM GMTతన్నీరు హరీశ్ రావు. గులాబీ దళపతి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు. అంతేకాదు రాష్ట్ర నీటిపారుదల - శాసనసభా వ్యవహారాలు - మార్కెటింగ్ శాఖ మంత్రి. టీఆర్ ఎస్ లో కేసీఆర్ తర్వాతి స్థానం హరీశ్ రావుదా? కేటీఆర్ దా అనే సందేహాలు, చర్చోపచర్చలు పెద్ద ఎత్తున్నే సాగుతున్న క్రమంలో ఇటీవలే కేసీఆర్ కూతురు కవిత దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కేసీఆర్ వారసుడు తన సోదరుడేనని ప్రకటించారుజ మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ ఎస్ అద్భుతమైన విజయానికి కారకుడిగా పేర్కొంటూ కేటీఆర్ కు ప్రమోషన్ దక్కిన సంగతి తెలిసిందే. అప్పటికే ఉన్న ఐటీ, పంచాయతీ రాజ్ శాఖలకు తోడుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించారు.
ఇటు కవిత స్టేట్ మెంట్, అటు కేటీఆర్ కు కొత్త బాధ్యతల నేపథ్యంలో హరీశ్ రావు సంగతేంటని అభిప్రాయాలు తెరమీదకు వచ్చాయి. అయితే వాటికి తాజాగా సమాధానం వచ్చినట్లయింది. హైదరాబాద్ వేడుకగా జరిగి పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ కు ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పీఆర్వోల ప్రాముఖ్యత పెరిగిందని తెలిపారు. వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజలు-ప్రభుత్వానికి పీఆర్వోలు వారధి లాంటివారని చెప్పారు.
హరీశ్ రావు ఈ సమావేశానికి ప్రభుత్వం తరఫున హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. సమాచార పౌరసంబంధాల శాఖ ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిధిలో ఉంది. ప్రతి కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి మండలి చర్చించి వివరాలను కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడించేవారు. కానీ గ్రేటర్ ఫలితాల తర్వాత జరిగిన కేబినెట్ సమావేశం వివరాలను హరీశ్ రావు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగానే హరీశ్ కు కొత్త శాఖ ఇస్తున్నారనే అభిప్రాయాలు కలిగాయి. తాజాగా పౌరసంబంధాల అధికారుల సమావేశానికి హాజరుకావడంతో...హరీశ్‌కు కొత్త బాధ్యతల కోటాలో సమాచార పౌరసంబంధాల శాఖ ఖరారు అయిపోయినట్లుగా చెప్తున్నారు.