Begin typing your search above and press return to search.
మామకు ఏమాత్రం తీసిపోని అల్లుడు.. వారందరికి ఐప్యాడ్లు.. ఐఫోన్లు
By: Tupaki Desk | 18 Jun 2021 4:30 AM GMTఈ మధ్యన అదనపు కలెక్టర్ల కాన్సెప్టుకు సరికొత్తగా డిజైన్ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరి కార్యాలయాల్ని త్వరలోనే పెద్ద ఎత్తున నిర్మిస్తామని చెప్పటం తెలిసిందే. వారికంటూ కార్యాలయాలు కలెక్టరేట్ పక్కనే నిర్మిస్తామని చెప్పారు. అక్కడితో ఆగని ఆయన.. తన సమీక్షా సమావేశం పూర్తి అయ్యాక.. వారికి రూ.30లక్షకు పైనే ఉండే కియో లగ్జరీ కార్లను అందించారు. బాగా పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. తాజాగా మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో తాజాగా మంత్రివర్గ ఉప సంఘం భేటీ జరిగింది.
ఈ సమావేశానికి పలువురు మంత్రులు తలసాని.. సబితా.. శ్రీనివాస్ గౌడ్.. జగదీశ్.. ప్రశాంత్ రెడ్డితో సహా సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆసుపత్రుల్లో ఎంత మంచి ఆహారం పెట్టినా.. పక్కనే దుర్వాసన వస్తుంటే ఎలా తింటారని ప్రశ్నించటంతో పాటు.. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యాన్ని అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించాలని కోరారు.
రాష్ట్రంలో వైద్య సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో భద్రపర్చాలన్న విషయాన్ని చెప్పిన ఆయన.. అందుకోసం అశావర్కర్లకు.. ఐఎన్ఎంలకు ఐప్యాడ్ లు.. ఐఫోన్లు అందించాలని కోరారు. డేటాను భద్రపర్చటమే ముఖ్యమైనప్పుడు బాగా పని చేసేవి ఇస్తే సరిపోతుంది. అంతేతప్పించి ఖరీదైన ఐఫ్యాడ్లు.. ఐఫోన్లు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఆచితూచి ఖర్చు చేయాల్సిన వేళలో.. అందుకు భిన్నంగా భారీ ఎత్తున అవసరమైన ఫోన్లకు అంత ఖరీదైన ఫోన్లను రికమెండ్ చేయటమా? అన్న మాట వినిపిస్తోంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కొలువు తీరిన కేసీఆర్ సర్కారులో ఇప్పటివరకు హరీశ్ ఇంతలా నిర్ణయం తీసుకున్నది లేదు. అంతేకాదు.. మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి భారీ కవరేజ్ తో పాటు.. హరీశ్ మాటలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిన వైనం చూస్తే.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలే కారణమంటున్నారు. ఏమైనా..వరాలు ఇవ్వటంలో మామకు ఏ మాత్రం తీసిపోని మేనల్లుడన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి.