Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. హరీష్ భారీ బైక్ ర్యాలీ

By:  Tupaki Desk   |   11 Aug 2021 9:30 AM GMT
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. హరీష్ భారీ బైక్ ర్యాలీ
X
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ స్వగ్రామం. యాదవ కమ్యూనిటీలో జన్మించాడు. ఈయన తండ్రి గెల్లు మల్లయ్య వ్యవసాయదారుడు. శ్రీనివాస్ గ్రామీణ రాజకీయాల్లో చురుకుగా ఉంటూ 1985 నుంచి టీడీపీలో చురుకైన పాత్ర పోషించాడు. 2004లో టీఆర్ఎస్ లో చేరి అంచలంచెలుగా విద్యార్థి నేతగా ఎదిగారు. ఈయన ప్రకటనతో మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ లో కాలుమోపి భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇన్నాళ్లు సిద్దిపేట నుంచే రాజకీయం చేసిన మంత్రి హరీష్ రావు నేరుగా హుజూరాబాద్ లో అడుగుపెట్టారు. నేరుగా హుజూరాబాద్ లో భారీ బైక్ ర్యాలీశారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్.. గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించడంతో పార్టీలో పొలిటికల్ హీట్ భారీగా పెరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇన్ చార్జి హరీష్ ఈ శుభ సందర్భంగా నేరుగా రంగంలోకి దిగారు.

రేపో మాపో ఎన్నిక నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేస్తున్న వేళ పార్టీలన్నీ జోరు పెంచాయి. ఇప్పటికే ఈటల రాజేందర్ మళ్లీ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. తాజాగా తొలిసారి హుజూరాబాద్ లో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లు సిద్దిపేటలో తెరవెనుక మంత్రాంగం నడిపిన హరీష్ ఇప్పుడు డైరెక్టుగా ఫీల్డ్ లోకి దిగాడు. హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీ ర్యాలీతో మంత్రి హరీష్ రావు ఎంట్రీ ఇచ్చాడు. మంత్రి గంగుల కమలాకర్ తోపాటు కొప్పుల ఈశ్వర్ , కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీని హరీస్ రావు నిర్వహించారు.

ఇక హరీష్ రావుకు హుజూరాబాద్ లో క్యాడర్ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పింది. కేసీ క్యాంప్ నుంచి జమ్మికుంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. హుజూరాబాద్ చౌరస్తాకు చేరుకున్న మంత్రులు హరీస్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో కలిసి ముందుగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం హుజూరాబాద్ చౌరస్తాలో మంత్రులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.