Begin typing your search above and press return to search.

ఘ‌టికుడ‌వే హ‌రీశ్‌

By:  Tupaki Desk   |   11 Nov 2015 7:10 AM GMT
ఘ‌టికుడ‌వే హ‌రీశ్‌
X
తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పార్టీ కీల‌క నేత‌ల్లో ఒక‌రే కాకుండా...ఎన్నిక‌ల వ్యూహాలు ప‌న్న‌డంలో దిట్ట‌ అందుకే టీఆర్ ఎస్‌ కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఏ ఎన్నిక‌ల‌కు అయినా హ‌రీశ్‌రావు బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచార పర్వంలో హ‌రీశ్‌కు ముందుగా ప్రాధాన్యం ఇవ్వ‌నప్ప‌టికీ ఆ త‌ర్వాత హ‌రీశ్‌ కు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో త‌న‌దైన శైలిలో హ‌రీశ్ దూకుడుగా వెళుతున్నారు.

తాజాగా వరంగల్‌ తూర్పు - పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్‌ షో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ ఓట‌ర్ల‌ను ఫిదా చేసే డైలాగ్‌ లు వ‌దిలారు. ఓరుగల్లు ఉద్యమానికే కాదు అబివృద్ధిలోను ఆదర్శంగా నిలిచిందని హ‌రీశ్ కితాబిచ్చారు. గత ప్రభుత్వాలు కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ కోసం స్థల సేకరణ జరపలేదని, కోచ్‌ ఫ్యాక్టరి నిర్మాణానికి ఎలాంటి కృషి చేయలేదని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం కోచ్‌ ఫ్యాక్టరీ కోసం 18 ఎకరాల స్థలాన్ని కొని ఇవ్వడం జరిగిందని హరీశ్‌ రావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు నాలుగు లైన్ల రోడ్డుతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఏడాదిలో పూర్తి కానున్నాయ‌ని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా....ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ కు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలో ఓరుగల్లు కీర్తి తోరణాన్ని చేర్చడం నిదర్శనమని హ‌రీశ్‌ రావు చెప్పారు. వరంగల్‌ ఉప ఎన్నికలో గెలుపు ఖాయమైందని అయితే మెజార్టీ లెక్క తేలాల్సి ఉందని ఓట‌ర్ల‌లో జోష్ నింపారు. వరంగల్‌ రంగ సముద్రం చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌ గా మారుస్తూ 3.20 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. 6 కోట్లతో వరంగల్‌ కూరగాయాల మార్కెట్‌ ను అభివృద్ది పరచడానికి నిధులు కేటాయించడం జరిగింది.. హైదరాబాద్‌ లో గడ్డి అన్నారం పండ్ల మార్కె ట్‌ తరహాలో వరంగల్‌ లో కూడా పండ్ల మార్కె ట్‌ నిర్మాణం చేపడుతామని హరీష్‌ రావు తెలి పారు. ఓట‌ర్ల‌నే హామీల వాన‌లో ముంచిన హరీష్‌ రావు అంత‌టితో వ‌దిలేయ‌కుండా స్థానిక నాయ‌కులను పొగిడేశారు. వ‌రంగ‌ల్‌ తూర్పు ఎంఎల్‌ ఏ కొండా సురేఖ - మాజీ ఎంఎల్సీ కొండా మురళీధర్‌ రావు అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్నారని చెప్పారు.

చూసి ర‌మ్మంటే కాల్చివ‌చ్చిన చందంగా.... ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వెళ్లిన హ‌రీశ్‌ రావు ప్ర‌భుత్వం ఏమేం చేసిందో ఏక‌రువు పెట్ట‌డ‌మే కాకుండా...అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల లిస్ట్ కూడా చ‌దివి వినిపించేసి ఘ‌టికుడ‌ని నిరూపించుకున్నారు.