Begin typing your search above and press return to search.
కేసీఆర్ సొంతూరి ప్రేమ..హరీశ్ ను బుక్ చేసింది
By: Tupaki Desk | 24 July 2019 1:30 AM GMTనిజమే... టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన సొంతూరు చింతమడకపై చూపించిన ఔదార్యం ఆయన మేనల్లుడు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును బుక్ చేసేసింది. అంతేకాదండోయ్... కేసీఆర్ తన సొంతూరికి భారీ ఎత్తున చేసిన కేటాయింపులు హరీశ్ రావుకు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాయి. అదేంటీ... కేసీఆర్ తన సొంతూరికి నిధులు విడుదల చేస్తే... హరీశ్ కు వచ్చిన ఇబ్బందేమిటంటారా? ఇక్కడే అసలు సిసలు చిక్కుంది. సీఎం హోదాలో కేసీఆర్ తన సొంతూరికి చేసిన కేటాయింపుల మాదిరే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తన సొంత నియోజకవర్గం పులివెందులకు భారీ కేటాయింపులు చేశారు. నాడు వైఎస్ తీసుకున్న నిర్ణయంపై తనదైన శైలిలో ఎగిరిపడ్డ హరీశ్... ఇప్పుడు వైఎస్ మాదిరే కేసీఆర్ తన సొంతూరికి చేసిన కేటాయింపులపై నోరు పెగల్చరా? అంటూ నెటిజన్లు హరీశ్ ను నిజంగానే ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
ఇక అసలు విషయంలోకి వస్తే... నిన్న తన సొంతూరు చింతమడకకు వెళ్లిన కేసీఆర్... ఆ ఊరిని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ఏకంగా రూ.200 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు హరీశ్ రావు సమక్షంలోనే జరిగిపోయాయి. ఈ సందర్భంగా హరీశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క ఊరికే రూ.200 కోట్లు, అది కూడా తన నియోజకవర్గంలో ఉన్న ఊరికి దక్కిందంటే హరీశ్ కు సంతోషమే కదా. ఇక్కడే నెటిజన్లు ఓ విషయాన్ని తవ్వి తీశారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు వైఎస్ ఒకేసారి రూ.200 కోట్లను కేటాయించారు. నాడు విపక్షంలో ఉన్న హరీశ్ రావు.. పులివెందులకు వైఎస్ కేటాయింపులపై ఓ రేంజిలో లేచారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేదంటే కడప జిల్లాకో, రాయలసీమకో, ఆంధ్రా ప్రాంతానికో ముఖ్యమంత్రా? అంటూ వైఎస్ ను నిలదీశారు.
ఒక్క పులివెందులకు మాత్రమే రూ.200 కోట్లు కేటాయించడమంటే ప్రాంతీయతత్వాన్ని ఎగదోస్తున్నట్లు కాదా? అని విరుచుకుపడ్డారు. ఇడుపులపాయకు, పులివెందులకు, వాళ్ల ఎస్టేట్లు ఉన్న ప్రాంతాలకు ఫోర్ లేన్ రోడ్లు వేసుకున్నారని, తెలంగాణకు అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో వైఎస్ ను ప్రాంతీయ వాదిగా అభివర్ణించిన హరీశ్... ప్రాంతీయ వాదిగా మీరు వ్యవహరిస్తూ, మమ్మల్ని ప్రాంతీయ వాదులంటారా? అంటూ కూడా వైఎస్ ను హరీశ్ నిలదీశారు. నాడు ఈ దిశగా వైఎస్ పై ఓ రేంజిలో విరుచుకుపడుతూ హరీశ్ చేసిన ప్రసంగానికి చెందిన వీడియోను పట్టేసిన నెటిజన్లు... మరి ఇప్పుడు కేసీఆర్ ప్రాంతీయ వాదిగా కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ నయం... తన నియోజకవర్గానికి రూ.200 కోట్లు కేటాయించారు, ఇప్పుడు కేసీఆర్ ఏకంగా తన సొంతూరికి మాత్రమే రూ.200 కోట్లు కేటాయించారు... ఇప్పుడేమంటారు హరీశ్ గారూ అంటూ నెటిజన్లు పేలుస్తున్న కామెంట్లకు హరీశ్ కు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.