Begin typing your search above and press return to search.
హరీశ్ కు ఊపిరి ఆడనట్లు చేస్తున్నావే వంటేరు!
By: Tupaki Desk | 8 Nov 2018 4:09 AM GMTతెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలోకి దిగే గజ్వేల్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. కేసీఆర్ పై కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఓటమే తన లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న వంటేరుకు గజ్వేల్ లో స్థానికంగా మాంచి పట్టు ఉంది. కేసీఆర్ ను ఓడించటం ద్వారా సంచలనం సృష్టించాలని పట్టుదలతో వంటేరు ఉన్నట్లు చెబుతారు.
తన మేనమామ కేసీఆర్ బరిలోకి దిగనున్న గజ్వేల్ నియోజకవర్గంపై హరీశ్ మరింత ఫోకస్ చేశారు. తన నియోజకవర్గాన్ని వదిలేసిన హరీశ్.. గజ్వేల్ లో కేసీఆర్ విజయం కోసం పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. దీంతో.. హరీశ్ వర్సెస్ వంటేరు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇటీవల కాలంలో హరీశ్ పై వంటేరు సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తన మేనమామను ఓడించాలని హరీశ్ తనతో చెప్పినట్లుగా వంటేరు ప్రతాపరెడ్డి వెల్లడించటం.. దీనిపై ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. తాజాగా హరీశ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వంటేరు ప్రతాపరెడ్డి. ఇప్పటికే మేనమామకు షాకిచ్చేలా కొందరు రాజకీయ ప్రముఖులతో రహస్య మీటింగ్ పెట్టినట్లుగా కేసీఆర్ అండ్ కో అనుమానిస్తున్న వేళ.. అందుకు బలం చేకూరేలా వంటేరు తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. గతంలో తానూ.. హరీశ్ రెండుసార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రైవేటు నెంబరు నుంచి హరీశ్ తనకు కాల్ చేశారని.. మాట్లాడిన దానితో సహా అన్నింటికి ఆధారాలు ఉన్నట్లుగా చెబుతున్న వంటేరు.. తమ మధ్య జరిగిన రెండు భేటీలు హైదరాబాద్ లో జరిగాయన్నారు. సమయం.. సందర్భం వచ్చినప్పుడు తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాల్ని బయటకు వెల్లడిస్తానని చెప్పారు.
హరీశ్ తో ప్రైవేటు భేటీ జరిగిందన్న విషయంపై తాను ఏ దేవుడి ముందైనా ఒట్టు వేస్తానని.. అందుకు ఆయన సిద్ధమా? అంటూ విసిరిన సవాల్ ఇప్పుడు కొత్త కలకలంగా మారింది.
ఒక టీవీ ఛానల్ తో మాట్లాడిన సందర్భంగా వంటేరు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిమాదిరే హరీశ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వంటేరు..రాష్ట్ర నాయకుడు కాస్తా గ్రామ నాయకుడిగా మారారని చెబుతున్నారు. హరీశ్ లాంటి రాష్ట్ర స్థాయి నాయకుడు గ్రామ స్థాయి నాయకుడైన తనతో పోటీ పడటం.. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ ఎస్ సర్కారు ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారని.. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అంటూ క్వశ్చన్ చేశారు. గడిచిన 17 ఏళ్లలో హరీశ్ ఆస్తులు ఏ విధంగా పెరిగాయో చూడాలన్న ఆయన.. తన ఆస్తుల గురించి హరీశ్ ప్రకటన చేయగలరా? అంటూ హరీశ్ కు ఊపిరి ఆడనట్లుగా సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.