Begin typing your search above and press return to search.
ఒకప్పుడు తుమ్మితే సత్యం అనేవారు..ఇప్పుడు సత్తిమిరా అంటున్నారు!
By: Tupaki Desk | 10 April 2020 10:30 AM GMTకరోనా వైరస్ .. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తూ - ప్రజలని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ కరోనా కి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ...కరోనా ను అరికట్టడానికి మరో మార్గం లేకపోవడంతో లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చారు. దీనితో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదు అని ప్రజాప్రతినిధులు - అధికారులు ప్రాణాలని పనంగా పెట్టి .. ప్రజలకి కరోనా పై అవగాహన పెంచుతున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తుమ్మితె సత్తెం అనేవారని.. ఇప్పుడు ఎవరైనా తుమ్మితే సత్తిమిరా అంటున్నారని - ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి సామాన్య ప్రజలకు తనదైన శైలిలో వివరించారు. మనిషి ప్రాణాల కంటే ముఖ్యమైంది ఏదీ లేదని.. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యమని తెలిపారు.
ఇంటిపట్టున ఎవరికి వారుండడమే కరోన వైరస్ కు అసలైన మందు. అమెరికా - చైనా - ఇటలీ దేశాల పరిస్థితి మనకు రావొద్దంటే.. లాక్ డౌన్ ముగిసేవరకు ఎవరూ ఇంటి నుంచి బయటికి రావొద్దు అని హరీశ్ రావు సూచించారు. ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో లాక్ డౌన్ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ - అధికారులకు సూచనలు ఇస్తూ మంత్రి హరీశ్ రావు బిజీబిజీగా గడుపుతున్నారు.
అలాగే, ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బందిపైనా హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు. అమ్మ మనకు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారని, కరోనా పై పోరాటంలో తెలంగాణ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది చూపుతున్న అంకితభావం - త్యాగనిరతి అద్భుతమైనవి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలనే పణంగా పెడుతు సైనికుల్లా పనిచేస్తూన్న వీరందరికి అండగా ఉండటం మన బాధ్యత అని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 471కి చేరాయి. అలాగే రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకు 12 మంది మరణించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.