Begin typing your search above and press return to search.
అక్కడ కానీ హరీశ్ లేకుంటే ఆగమాగమే
By: Tupaki Desk | 26 Dec 2015 5:08 AM GMTటీఆర్ ఎస్ కు హరీశ్ అవసరం ఎంతన్నది అందరికి ప్రాక్టికల్ గా అర్థమైన పరిస్థితి శుక్రవారం చోటు చేసుకుంది. హరీశ్ ను వన్ మ్యాన్ ఆర్మీగా ఎందుకు అభివర్ణిస్తారో ఎర్రవెల్లిలో ఆయన్ను చూసిన వారికి బాగానే తెలిసి వచ్చింది. పరిస్థితి ఎలా ఉన్నా.. అన్నింటిని చక్కదిద్దే ఓర్పు.. నేర్పు.. సామర్థ్యం హరీశ్ లో ఎంత ఉందన్న విషయం టీఆర్ ఎస్ దళాలకే కాదు.. సామాన్యులకు సైతం స్పష్టంగా అర్థమైంది.
ఊహించినట్లే.. ఎర్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత చండీయాగానికి భారీగా ప్రజలు పోటెత్తారు. శుక్రవారం స్పెషల్ ఏమిటంటే.. అటు సామాన్య జనమే కాదు.. వీవీఐపీలు కూడా భారీగానే వచ్చేశారు. దీంతో.. యాగస్థలి వద్ద ఇసుక వేస్తే రాలనంత భారీగా జనం పోగైంది. ఇక.. వాహనాల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎటు చూసినా జన ప్రవాహమే కనిపించింది.
అలాంటి పరిస్థితి కాసేపు కొనసాగితే.. పరిస్థితి అదుపు తప్పి ఏమైనా జరుగుతుందన్న ఆందోళన భద్రతా సిబ్బందిలో ఎదురైంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో సిట్యూవేషన్ అర్థం చేసుకున్న హరీశ్ సీన్ లోకి వచ్చేశారు. జనాల్ని ఎలా కంట్రోల్ చేయాలి? రద్దీని సమర్థవంతంగా ఎలా నిలువరించాలి? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా ఉండాలి? ట్రాఫిక్ ను ఎలా క్లియర్ చేయాలి? యాగం కోసం ఎన్నో వ్యయప్రయాసలతో వచ్చిన సామాన్యుల మనసులు నొచ్చుకోకుండా వారిని హ్యాపీగా ఇంటికి ఎలా పంపాలో బాగా తెలిసిన హరీశ్ రంగంలోకి దిగారు. ఆయనకు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగ రవీందర్ రెడ్డి.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తోడయ్యారు.
అంతే.. కిటకిటలాడుతున్న ప్రాంగంణంలో గందరగోళం చోటు చేసుకోకుండా పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేశారు. కాకుంటే ఇందుకు కొద్ది సమయం పట్టింది. రద్దీని కంట్రోల్ చేశారు. జన ప్రవాహాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసు అధికారులు పలువురు.. ‘‘హరీశ్ అన్న చెప్పిన తర్వాత కూడా మాట వినకపోతే ఎలా?’’ అంటూ సర్దిచెబుతూ ఉండటం కనిపించింది. ఇక భారీగా తరలి వచ్చిన జనాల్ని కంట్రోల్ చేయటం.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే క్రమంలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్న ఆయన.. వచ్చిన వారికి అందించే ప్రసాదం.. భోజనం నాణ్యత విషయంలో తేడా రాకూడదన్న విషయాన్ని మర్చిపోలేదు. అంత హడావుడిలోనూ వంటశాలకు వెళ్లి.. స్వయంగా ఆహారపదార్థాల నాణ్యతను పరిశీలించి.. చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పేసి.. అందరూ ఊపిరి పీల్చుకునేలా చేశారు. హరీశ్ చొరవను.. సామర్థ్యాన్ని స్వయంగా చూసిన పలువురు.. హరీశ్ కానీ లేకుండా ఆగమాగమయ్యేదన్న మాట పలువురు నోట వినిపించింది.