Begin typing your search above and press return to search.
ఆర్టీసీ సమీక్షకు హరీశ్ కు ఆహ్వానం లేదా?
By: Tupaki Desk | 8 Jun 2018 4:42 AM GMTసమస్యను పరిష్కరించటానికి రెండు మార్గాలు ఉంటాయి. సానుకూలంగా స్పందించటం.. అది కుదరకపోతే సామరస్యపూర్వకంగా సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేయటం ఒక పద్దతి. రెండో విధానంలో అందుకు భిన్నమైన విధానాన్ని అనుసరించటం. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల తాజా డిమాండ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విధానాన్ని అనుసరించాలని డిసైడ్ కావటం కనిపిస్తుంది.
నిజంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఇప్పటి బెదిరింపు ధోరణితో కాకుండా.. సామరస్యంగా ఇష్యూను క్లోజ్ చేసేందుకు అవకాశం లేదా? అంటే.. ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వం ఇన్నేసి సంక్షేమ కార్యక్రమాల్ని.. పథకాల్ని నెత్తికి ఎత్తుకున్న వేళ.. మీరంతా సహకరించాల్సింది పోయి.. ఇలా సమ్మె నోటీసులు ఇస్తే ఎలా? బంగారు తెలంగాణ సాధనలో మీరు భాగస్వామ్యం కావాలే తప్పించి.. ఇలా సమ్మె చేసి.. తెలంగాణ అభివృద్ధి తిరోగమనం చెందదా? పెద్ద మనసుతో డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గొచ్చుగా? అని కేసీఆర్ కోరితే కాదనే ఉద్యోగ సంఘాలు ఉంటాయా? అంటే సమాధానం ఇట్టే చెప్పేస్తారు.
ఉద్యోగ సంఘాల కోరికలు పెద్దవే అయినా.. వాటి విషయంలో ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా వ్యవహరించే తీరును ప్రదర్శించే సీఎం కసీఆర్.. అందుకు భిన్నంగా ఈసారి ఫైర్ కావటం.. సమ్మె ఆలోచన మానకపోతే ఏకంగా సంస్థనే మూసేస్తానంటూ హెచ్చరికలు చేయటం షాకింగ్ గా మారాయి.
ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఇంత తీవ్రంగా హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఉందా? అంటే.. లేదనే చెప్పాలి. ఎందుకంటే.. కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మంత్రి హరీశ్ రావు మాటను వారు కాదనే ముచ్చటే లేదు. కాకుంటే.. పాతిక శాతం అడిగినోళ్లు పది శాతానికి డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు కాదులే.. కాస్త వెనక్కి తగ్గండని చెబితే వారు మాట వినొచ్చు కూడా. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఏకాఏకిన వార్నింగ్ ఇచ్చేయటం చూస్తే కేసీఆర్ కోపంలో బయటకు చెప్పలేని చికాకు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మెనోటీసుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమీక్షకు మంత్రి హరీశ్ రావును ఆహ్వానించకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. కీలకమైన ఆర్టీసీ సమ్మె సమీక్షకు మంత్రి హరీశ్ ను పిలిచి.. కార్మిక సంఘాలకు కాస్త గట్టిగా చెప్పాలంటే సరిపోతుంది. నిజానికి ఆ మాట కోసం సమీక్షను నిర్వహించాల్సిన అవసరం కూడా లేదు. హరీశ్‌కు ఒక్క మాట చెబితే ఆయన చేయాల్సింది చేసేస్తారు.
కానీ.. అందుకు భిన్నంగా కేసీఆర్ రియాక్ట్ కావటం చూస్తే.. ఆర్టీసీ కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్ కు చెక్ చెప్పేందుకే ఇంత ఆగ్రహాన్ని ప్రదర్శించారా? అన్న సందేహాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యన హరీశ్ పేషీలో ఉన్న ఒక అధికారి ఒక పత్రికలో రాసిన వ్యాసం తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్న పేరుతో ఆయన్ను సాగనంపే వరకూ ఊరుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. హరీశ్ పెద్దన్నలా ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలకు నేరుగా ఘాటు వార్నింగ్ ఇవ్వటం చూసినప్పుడు సమ్మె చేస్తామన్న కార్మికుల మీద కేసీఆర్ ఆగ్రహం వెనుక ఇంకేదో బలమైన కారణం ఉందన్న వాదన వినిపిస్తోంది. మరి.. ఇందులో నిజం ఎంతన్నది కాలమే సరిగా సమాధానం చెబుతుందనటంలో సందేహం లేదు.