Begin typing your search above and press return to search.
అనూహ్యం.. కేసీఆర్ కు దూరంగా హరీష్..
By: Tupaki Desk | 24 Aug 2019 5:01 AM GMTఎంత దాచుదామన్నా దాగదులే.. ఇప్పుడు టీఆర్ఎస్ లో అంతా ఓకే అని పైకి చెప్పినంత ప్రశాంతంగా లోపల చెప్పలేని పరిస్థితి నెలకొంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ - ఆయన మేనల్లుడు హరీష్ మధ్య గ్యాప్ పెరిగిందనేదానికి తాజా ఉదాహారణలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయట...
హరీష్ రావు.. పోయిన తెలంగాణ తొలి కేబినెట్ లో భారీ నీటి పారుదలశాఖ మంత్రి. కాళేశ్వరం గురించి ఇప్పుడు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే అదంతా హరీష్ చలువే అంటారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసి పూర్తి చేయించారు. ఇప్పుడు ఆయనే పేరు కాళేశ్వరంపై వినిపించని పరిస్థితి. ఇక రెండో ప్రభుత్వంలో హరీష్ కు మంత్రి పదవే ఇవ్వలేదు.. సరిలే అని ఊరుకొని హరీష్ తన పని తాను చేసుకుంటున్నారు.
అయితే కొన్ని నెలలుగా హరీష్ రావు సీఎం కేసీఆర్ ఫాం హౌస్ వైపు కన్నెత్తి చూడడం లేదట.. ఇక గజ్వేల్ కు కూడా వెళ్లకుండా సిద్దిపేటలో ఉంటున్నారట.. కేసీఆర్ నియోజకవర్గాన్ని - ఫాంహౌస్ కు దూరంగా హరీష్ ఎందుకున్నారన్న ప్రశ్న ఇప్పుడు గులాబీ శ్రేణులను కలవరపెడుతోందట..
ఇక తాజాగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి కేసీఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆహ్వానించారు. మంత్రి నిరంజన్ రెడ్డి సహా మెదక్ జిల్లా నేతలంతా హాజరైనా.. ఇదే జిల్లా కీలక నేత అయిన హరీష్ రావు మాత్రం కేసీఆర్ - కలెక్టర్ల పర్యటనకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
దీన్ని బట్టి మామా-అల్లుళ్ల మధ్య ఏదో గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోందన్న చర్చ మొదలైంది. హరీష్ ఇలా ఎప్పుడూ ప్రవర్తించడని.. ఏదో బలమైన కారణం ఉంటేనే ఇలా దూరంగా ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.