Begin typing your search above and press return to search.

ఆ వార్తపై హరీష్ వివరణ ఇచ్చాడు..!

By:  Tupaki Desk   |   10 July 2019 3:45 PM IST
ఆ వార్తపై హరీష్ వివరణ ఇచ్చాడు..!
X
చేతిలో మీడియా ఉంటే అవాస్తవాలు కూడా అద్భుతంగా ప్రచారం చేయవచ్చని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. కానీ దాని పర్యవసనాలు మాత్రం ఎంత దారుణంగా ఉంటాయో మీడియా యాజమాన్యాలు - జర్నలిస్టులు ఊహించరు. అలాంటి సంఘటనే తాజాగా మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావుకు ఎదురైంది. ఓ పత్రిక రాసిన తప్పుడు వార్తకు ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

తన కాళ్లు మొక్కుతున్నట్టుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రయత్నించారని ఓ పత్రిక తాజాగా ప్రచురించింది. దీనిని హరీష్ రావు షేర్ చేసి ట్విట్టర్ లో ఖండించారు. తెలంగాణలోని ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి హరీష్ రావుతోపాటు మంత్రులు అల్లోల - తలసాని వచ్చారు. ముగ్గురు ఒకే చోట కూర్చున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి లేచి హరీష్ రావుకు కాళ్లు మొక్కుతున్నట్టు సదురు పత్రిక కథనంలో పేర్కొంది.

కానీ మంత్రి లేవడానికి ఇబ్బందిపడుతుంటే తానే సాయం చేశానని హరీష్ రావు వివరణ ఇచ్చారు. దాన్ని తప్పుగా రాసిన పత్రిక వైఖరిని తూర్పారపట్టారు. ఈ వార్తను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇది బాధాకరమని.. వార్త రాసేముందు నిర్ధారణ చేసుకోవాలి కదా అని సూచించారు.