Begin typing your search above and press return to search.
కేసీఆర్ బడ్జెట్ స్పీచ్ విన్నాక..అయ్యో హరీశ్ అనుకోవాల్సిందే
By: Tupaki Desk | 9 Sept 2019 1:18 PM ISTబడ్జెట్ ప్రసంగాన్ని సింఫుల్ గా పూర్తి చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న చేదు నిజాన్ని చెప్పే క్రమంలో కేంద్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయాన్ని చెప్పేస్తూ.. విరుచుకుపడుతున్న మాంద్యం తీవ్రత ఎంతన్న విషయాన్ని చెప్పటమే కాదు.. ఇలాంటి పరిస్థితుల్లో ధనిక తెలంగాణలోనూ మాంద్యం ఎఫెక్ట్ చాలా దారుణంగా పడనుందన్న విషయాన్ని చెప్పేశారు.
ఇప్పుడొచ్చే ఆదాయం తగ్గిన నేపథ్యంలో రాబడి అంచనాల్ని తగ్గించిన ప్రభుత్వం.. ఖర్చుల విషయంలోనూ కొత్త విషయాల్ని చెప్పలేదు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తామని చెప్పటంతో పాటు.. పాత బకాయిల్ని చెల్లించే వరకూ ఎలాంటి కొత్త పనులు చేపట్టమన్న చేదు నిజాన్ని చెప్పేశారు.
అంతేకాదు.. బడ్జెట్ పూర్తి కాపీని వెబ్ సైట్లో పెట్టేశాం.. వాటిని చూసుకోండన్న మాటను చెప్పిన కేసీఆర్ స్పీచ్ మొత్తం విన్నాక.. కీలకమైన ఆర్థిక శాఖను మేనల్లుడు హరీశ్ కు కట్టబెట్టటం ద్వారా కసి తీర్చుకున్నారా? అన్న భావన కలగక మానదు. ఎందుకంటే.. ఏ శాఖకు ఎంత కేటాయింపు.. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్ కు ఉండాలి.
కానీ.. బడ్జెట్ స్పీచ్ లో ఒక విషయాన్ని క్లియర్ గా చెబుతూ.. చెల్లింపుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ను ఆయన చెబుతూ.. ఇప్పటికే ఉన్న బకాయిల్ని చెల్లించటమే తమ తొలి ప్రాధాన్యత అని.. దాని తర్వాతే మిగిలిన అంశాల మీద ఫోకస్ చేస్తామని చెప్పారు. అంటే.. ఖాళీగా ఉన్న గల్లా పెట్టే.. ఇంకా చెప్పాలంటే లోటుగా ఉన్న బొక్కసం తాళం చెవుల్ని హరీశ్ చేతికి ఇచ్చిన కేసీఆర్.. అందులోకి వచ్చే ఆదాయం ఏమైనా సరే.. తాను చెప్పిన రీతిలో బకాయిల చెల్లింపులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేశారు. అంటే.. ఆర్థికమంత్రిగా హరీశ్.. సింఫుల్ గా ఆఫీసుకు రావటం.. వెల్లటం తప్పించి పెద్దగా చేసేందుకు పనేమీ ఉండదని చెప్పక తప్పదు. అంతేనా.. ఆర్థిక శాఖ ఏం చేయాలన్న విషయాన్ని తన స్పీచ్ లోచెప్పేయటం ద్వారా పరిమితుల మధ్య హరీశ్ పని చేయటానికి మించి చేసేదేమీ లేదని చెప్పక తప్పదు.