Begin typing your search above and press return to search.
హరీశ్ నెట్ వర్క్ రేంజ్ ఏంతో మరోసారి రుజువైంది
By: Tupaki Desk | 29 Oct 2017 5:49 AM GMTతెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత ఆయన వారసుడిగా ఎవరన్న మాటకు అందరి వేళ్లు ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ వైపు చూపిస్తాయి. కానీ.. కేసీఆర్ చాణుక్యం.. ప్రత్యర్థిని దెబ్బ తీసే తత్వం లో కేటీఆర్ కంటే మొనగాడు మంత్రి హరీశ్ అని చెబుతుంటారు. అసలుసిసలైన రాజకీయ నాయకుడిగా వ్యవహరించే హరీశ్ తీరు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంటుంది.
మేనమామకు అసలుసిసలు వారసుడిగా హరీశ్ ను పలువురు అభివర్ణిస్తారు. రాజకీయ పరిణామాల్ని ముందుగా గుర్తించటం.. టాప్ సీక్రెట్స్ కు సంబంధించిన సమాచారం ముందస్తుగా హరీశ్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీవని చెబుతారు. తెలంగాణ రాష్ట్రంలో నిఘా విభాగానికి మించిన నెట్ వర్క్ హరీశ్ కు ఉందని చెబుతుంటారు.
ఓటుకు నోటు ఎపిసోడ్ లో రేవంత్ ను.. చంద్రబాబును అడ్డంగా బుక్ చేయటంలో మంత్రి హరీశ్ పాత్ర కీలకమన్న విషయం తెలిసిందే. జరగబోతున్న కుట్రను ముందుగా గుర్తించి.. అధినేతను అలెర్ట్ చేయటంతో పాటు.. బాబు బ్యాచ్ కు దిమ్మ తిరిగిపోయేలా చేయటం.. తట్టాబుట్టా సర్దుకొని ఏపీకి వెళ్లిపోయేలా చేయటంలో హరీశ్ కీలకపాత్ర పోషించారనే చెప్పాలి.
ఓటుకు నోటు ఎపిసోడ్ మాదిరి.. తాజాగా రేవంత్ రెడ్డి ఎగ్జిట్ కు సంబంధించి కూడా హరీశ్ కు అందిన సమాచారంపై టీఆర్ ఎస్ ముఖ్యనేతల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఆ పార్టీకి చెందిన కీలక నేతతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు మొదలు పెట్టిన రెండు రోజులకే ఆ సమాచారం హరీశ్ కు అందిందట.
ఈ విషయాన్ని తనకున్న నెట్ వర్క్ తో మరోసారి క్రాస్ చెక్ చేసుకొన్న హరీశ్.. నిజమేనని తేల్చుకున్నారట. ఆ వెంటనే ఈ సమాచారాన్ని అధినేత కేసీఆర్ కు అందజేయటం.. రేవంత్ ను దెబ్బ కొట్టేలా ప్లాన్ ను సిద్ధం చేశారట. పార్టీ మారే అంశాన్ని తన ముఖ్యనేతలకు రేవంత్ చెప్పటానికి ముందే.. హరీశ్ వర్గీయులు కొందరు వారిని సంప్రదించి.. రేవంత్ భవిష్యత్ ప్రణాళికను వివరించినట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ లోకి వెళ్లనున్న రేవంత్ కారణంగా ఫ్యూచర్ లో ఇబ్బందులేనని.. అదే సమయంలో తమ పార్టీలోకి వస్తే బాగా చూసుకుంటామన్న హామీని ఇచ్చారట. దీంతో.. కాంగ్రెస్ తో కలవటం ఇష్టం లేని రేవంత్ వర్గీయులు హరీశ్ మంత్రాగానికి ఓకే అన్నట్లు చెబుతున్నారు. టీడీపీని వదిలేసి.. కాంగ్రెస్ లోకి తాను వెళ్లనున్నట్లుగా రేవంత్ ప్రకటించటానికి ముందే.. ఆయన వర్గీయులుగా చెప్పుకునే కొడంగల్ స్థానిక నేతలు..కార్యకర్తలు పలువురు రేవంత్ కు గుడ్ బై చెప్పేసి.. టీఆర్ ఎస్ లో చేరిపోయారు.ముందుగా జరిగే రాజకీయ పరిణామాల్ని పసిగట్టటం.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో హరీశ్ ఎంత నేర్పరి అన్న విషయం మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.