Begin typing your search above and press return to search.
తాగుబోతు డ్రైవర్లకు హరీశ్ షాక్
By: Tupaki Desk | 22 Dec 2016 5:05 AM GMTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టీ హరీశ్ రావు తాగుబోతు డ్రైవర్లపై ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కరీంనగర్ - నిజామాబాద్ - సిద్దిపేట - రామగుండం పోలీస్ కమిషనరేట్ల బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. బాగా తాగి బండి నడిపితే పోలీసులు ఆపొద్దా? కాగితాలు లేకున్నా, ఆటోలో ఫుల్లుగా జనాన్ని నింపినా అడుగొద్దా? ఇదేం పద్ధతి అని ఫైర్ అయ్యారు. తాగి నడిపితే పంజాగుట్టలో ఏం జరిగిందో చూశామని - పోలీసుల ఆత్మసైర్థ్యం దెబ్బతినేలా మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నదని అందరూ ప్రశ్నిస్తారని మండిపడ్డారు.
సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ.. పోలీసులు తనిఖీల పేరిట - డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట తనిఖీలు చేస్తుంటే రోడ్లపై రెండు వైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోతున్నాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను సమర్థిస్తున్నానని, కానీ వలస కూలీలను తీసుకొచ్చే ఆటోలను ఆపి, మామిడి తోటల్లో పార్టీలు చేసుకునే వారిని పట్టుకుని ఫైన్లు రాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో అధికార - విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. వెంటనే మంత్రి హరీశ్ రావు కలుగజేసుకొని పై వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆయనకు అనుమతించకుండా బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డిని మాట్లాడాలని కోరారు. అయితే తనకు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని జీవన్ రెడ్డి పదే పదే స్పీకర్ ను కోరారు.
ఈ సమయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జోక్యం చేసుకొని, బిల్లుపై చర్చ సందర్భంగా అందులోని ఆంశాలపైనే మాట్లాడాలని, ఏదో ఒకటి మాట్లాడితే ఎలా అన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి కల్పించుకుంటూ ఉదయం నుంచి తాము సహకరించిన విషయం గుర్తు పెట్టుకోవాలని, సభ్యుడు జీవన్ రెడ్డి పట్టుబడితే కొద్దిసేపు అవకాశం ఇవ్వడంలో తప్పులేదని డిప్యూటీ స్పీకర్ ను కోరగా జీవన్ రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం కల్పించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/